స్టైలిష్ విలన్ గా మోహన్ బాబు

మంచు ఫ్యామిలీ హీరోలు ఇప్పుడు ఫుల్ ఫామ్ లోకి వస్తున్నారు. మంచు విష్ణు ‘కన్నప్ప‘తో విజయాన్ని అందుకుంటే.. మంచు మనోజ్ ‘మిరాయ్‘తో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. చాన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూసిన ఈ మంచు బ్రదర్స్ ఇద్దరికీ ఈ ఏడాది అనుకున్న విజయాలు లభించాయి.
ఇదే ఊపులో ఇప్పుడు విలక్షణ నటుడు మోహన్ బాబు కూడా హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. కాస్త గ్యాప్ తర్వాత మోహన్ బాబు పూర్తి స్థాయి విలన్ గా మెప్పించబోతున్నాడు. నాని ‘ది ప్యారడైజ్‘లో శిఖంజ మాలిక్ గా విలనిజాన్ని పంచబోతున్నాడు కలెక్షన్ కింగ్. ఈరోజు ఈ చిత్రం నుంచి మోహన్ బాబుకి సంబంధించి రెండు లుక్స్ రిలీజ్ చేసింది టీమ్.
ఒక లుక్ లో బేర్ బాడీతో రక్తపు చేతులతో వైల్డ్ గా కనిపిస్తే.. మరొక లుక్ లో పూల చొక్కా వేసుకుని చేతిలో గన్, నోటిలో సిగార్ తో స్టైలిష్ గా కనిపిస్తూ అదరగొడుతున్నాడు మోహన్ బాబు. ఆద్యంతం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి. సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ‘ది ప్యారడైజ్‘ రిలీజ్ కానుంది.
SHIKANJA MAALIK
— Nani (@NameisNani) September 27, 2025
Joins the sets… @themohanbabu 🔥#TheParadise pic.twitter.com/Kd4Lp0mgjQ
-
Home
-
Menu