మిథున్ ని కదిలించిన ప్రభాస్ మాటలు

పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ కోవలో ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతున్న సినిమా ‘ఫౌజీ‘ (వర్కింగ్ టైటిల్). ‘సీతారామం’ తర్వాత హను రాఘవపూడి నుంచి వస్తోన్న పీరియాడిక్ మూవీ ఇది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా గురించి బాలీవుడ్ వెటరన్ స్టార్ మిథున్ చక్రవర్తి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
ఈ సినిమా కోసం ఎంపికైన తర్వాత ఫోటోషూట్ నిర్వహించే సమయంలో మిథున్ చేతికి తీవ్ర గాయాలయ్యాయట. ఆ సమయంలో.. ముఖ్యంగా ప్రభాస్ ‘హెల్త్ ఈజ్ ఫస్ట్‘ మీరు రెస్ట్ తీసుకోండి అని మిథున్ తో చెప్పాడట. ప్రభాస్ అన్న ఆ మాటలు తన గుండెల్లో నిలిచిపోయినట్టు మిథున్ లేటెస్ట్ ఇంటర్యూలో తెలిపారు.
ఇప్పటికే తాను ‘ఫౌజీ‘ షూట్ లో పాల్గొన్నట్టు.. జయప్రద కాంబినేషన్ లో కొన్ని సీన్స్ చేసినట్టు తెలిపారు మిథున్. త్వరలో ప్రభాస్ తోనూ ఆయన స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్టు వెల్లడించారు. ఇక ఈ ప్రాజెక్టులో ప్రభాస్ సరసన అరబ్ బ్యూటీ ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తుంది. మరో కీలక పాత్రలో అనుపమ్ ఖేర్ కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్ తో ‘ఫౌజీ‘ రూపొందుతున్నట్టు తెలుస్తోంది.
-
Home
-
Menu