‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్.. మెగా ఫ్యాన్స్ ఖుషీ!

‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్.. మెగా ఫ్యాన్స్ ఖుషీ!
X
దసరా సీజన్‌కి మెగా ట్రీట్‌గా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ ఫస్ట్‌ సింగిల్‌ ‘మీసాల పిల్ల’ ఫుల్‌ లిరికల్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దసరా సీజన్‌కి మెగా ట్రీట్‌గా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ ఫస్ట్‌ సింగిల్‌ ‘మీసాల పిల్ల’ ఫుల్‌ లిరికల్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ప్రోమోతోనే హీట్‌ పెంచిన ఈ సాంగ్‌, ఫుల్‌ వెర్షన్‌లో మరింత ఎనర్జీతో అలరిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి – లేడీ సూపర్‌స్టార్‌ నయనతార జంటగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ క్రేజీ మాస్‌ ఎంటర్‌టైనర్‌ నుంచి వచ్చిన ఈ సాంగ్‌ పక్కా ఫ్యామిలీ మెలోడీ వైబ్‌తో ఉంది.

భీమ్స్‌ సిసిరోలియో ట్యూన్‌, భాస్కర భట్ల సరదా లిరిక్స్‌, ఉదిత్‌ నారాయణ్ – శ్వేతా మోహన్ గాత్రాలు కలసి మంచి ఫీల్‌ ఇచ్చాయి. చిరంజీవి స్టైలిష్‌ లుక్‌, నయనతార కెమిస్ట్రీ, విజయ్‌ పోలకి కొరియోగ్రఫీ ఇవన్నీ కలసి సాంగ్‌కి కొత్త లెవెల్‌ ఇచ్చాయి. మొత్తానికి, ‘మీసాల పిల్ల’ సాంగ్‌తో ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ మూవీపై హైప్‌ మాక్స్‌లోకి వెళ్లిపోయింది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ 2026 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది!



Tags

Next Story