మెగాస్టార్ ట్రిపుల్ ధమాకా

మెగాస్టార్ ట్రిపుల్ ధమాకా
X
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఈసారి డబుల్ కాదు.. ట్రిపుల్ ధమాకా అందుతోంది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్స్ వరుసగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఈసారి డబుల్ కాదు.. ట్రిపుల్ ధమాకా అందుతోంది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్స్ వరుసగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా ఒకరోజు ముందుగానే ‘విశ్వంభర‘ నుంచి గ్లింప్స్ రాబోతుంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదలకానున్న ఈ మూవీ నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు స్పెషల్ గ్లింప్స్ వస్తున్నట్టు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

రేపు (ఆగస్టు 22) ఉదయం 11.25 గంటలకు ‘మెగా 157‘ టైటిల్ గ్లింప్స్ రాబోతుంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిరుకి జోడీగా నయనతార నటిస్తుండగా.. కీలక కేమియోలో విక్టరీ వెంకటేష్ కనువిందు చేయనున్నాడు.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో బాబీ తెరకెక్కించే సినిమా అనౌన్స్ కూడా రేపు రానుందట. చిరంజీవికి ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య‘ వంటి ఘన విజయాన్ని అందించిన బాబీ ఈసారి మరో ఎంటర్ టైనింగ్ సబ్జెక్ట్ తో రెడీ అవుతున్నాడట. చిరంజీవి, బాబీ మూవీని కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల ఓ సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.

Tags

Next Story