ప్రభాస్ 'స్పిరిట్'లో మెగాస్టార్?

ప్రభాస్ స్పిరిట్లో మెగాస్టార్?
X
ప్రెజెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన వార్త ఏమిటంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందే ‘స్పిరిట్’ మూవీలో మెగాస్టార్ చిరంజీవి ఒక కీలక పాత్రలో నటించబోతున్నారనే టాక్.

ప్రెజెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన వార్త ఏమిటంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందే ‘స్పిరిట్’ మూవీలో మెగాస్టార్ చిరంజీవి ఒక కీలక పాత్రలో నటించబోతున్నారనే టాక్. చిరంజీవికి వీరాభిమాని అయిన సందీప్ రెడ్డి 'స్పిరిట్'లో మెగాస్టార్ కోసం ఓ స్పెషల్ రోల్ ను డిజైన్ చేశాడట.

‘యానిమల్’లో అనిల్ కపూర్ పోషించిన పాత్ర సినిమాకు అదనపు బలం చేకూర్చిన విషయం తెలిసిందే. అదే తరహాలో ‘స్పిరిట్’లో కూడా ఓ పవర్‌ఫుల్ రోల్ కోసం సందీప్ వంగా మెగాస్టార్‌ను ఆన్ బోర్డులోకి తీసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’, అనిల్ రావిపూడితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలు ఫినిషింగ్ స్టేజ్ లో ఉండగా.. బాబీ డైరెక్షన్‌లో ‘మెగా 158’, శ్రీకాంత్ ఓదెలతో ‘మెగా 159’ పైప్ లైన్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చిరంజీవి ‘స్పిరిట్’ కోసం డేట్స్ కేటాయిస్తాడా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ప్రభాస్-సందీప్ 'స్పిరిట్' మూవీ సెప్టెంబర్ చివరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

Tags

Next Story