'విశ్వంభర' నుంచి మెగా అప్డేట్?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’. ఈ సినిమా నుంచి ఈరోజు ఉదయం 9:09 గంటలకు ఓ కీలక అప్‌డేట్ రాబోతోందని చిరు స్వయంగా ప్రకటించడంతో మెగా అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించి చిరు అందించే అప్డేట్ రిలీజ్ డేట్ గురించి అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఇక రేపు (ఆగస్టు 22న) మెగాస్టార్ బర్త్ డే ఉండటంతో 'విశ్వంభర'తో పాటు మరో చిత్రం మెగా 157కి సంబంధించి కూడా టీజర్ రాబోతుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. మొత్తంగా.. ఈ మెగా బర్త్‌డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఖాయం.
An Important update about #Vishwambhara will be out Tomorrow at 09:09AM.
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 20, 2025
Stay Tuned to @MegaStaroffl
-
Home
-
Menu