‘పెద్ది’ నుంచి మెగా అప్డేట్

‘పెద్ది’ నుంచి మెగా అప్డేట్
X
'ఆర్.ఆర్.ఆర్'తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ కు.. 'గేమ్ ఛేంజర్' తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని పట్టుదలతో ఉన్నాడు చరణ్.

'ఆర్.ఆర్.ఆర్'తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ కు.. 'గేమ్ ఛేంజర్' తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని పట్టుదలతో ఉన్నాడు చరణ్. మరోసారి పాన్ ఇండియా రేంజ్‌లో తన ప్రభావాన్ని చూపించాలనే లక్ష్యంతో ‘పెద్ది’ చిత్రాన్ని ప్రారంభించాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్‌కు ఆరేడు నెలల సమయం ఉండగానే, ‘పెద్ది’ యూనిట్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటిస్తూ 'పెద్ది ఆత్మ, భావోద్వేగాలను మాస్ట్రో ఏఆర్ రెహ్మాన్ అద్భుతంగా అందించారు. మా ఫస్ట్ సింగిల్ త్వరలో రాబోతోంది' అని వెల్లడించాడు. ఈ పోస్టుతో పాటు, రామ్ చరణ్, ఏఆర్ రెహ్మాన్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత సతీష్ కిలారు కలిసి ఉన్న స్టూడియో ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలకు రెండుమూడు నెలల ముందు మాత్రమే ప్రచారం మొదలుపెడతాయి. కానీ ‘పెద్ది’ మాత్రం విరుద్ధంగా ముందుగానే సింగిల్స్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ద్వారా హైప్ ఆకాశాన్నంటిన పరిస్థితిలో, ఇప్పుడు సాంగ్ రిలీజ్ వార్త అంచనాలను మరింత పెంచింది.

ఇక మ్యూజిక్ విషయానికి వస్తే – షూటింగ్ మొదలుకాకముందే ఏఆర్ రెహ్మాన్ మూడు పాటలు సిద్ధం చేశారు. తాజాగా మిగతా సాంగ్స్‌తో పాటు బిట్ సాంగ్స్, థీమ్ మ్యూజిక్ కూడా కంప్లీట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మైసూర్‌లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో టైటిల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. 1000 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొంటున్న ఈ గ్రాండ్ నెంబర్‌ను ఫస్ట్ సింగిల్‌గా రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

‘పెద్ది’లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ టెక్నికల్ ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్స్. వృద్ధి సినిమాస్ నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో ఈ సినిమా వస్తోంది.



Tags

Next Story