‘మిరాయ్‘ డైరెక్టర్ కి మెగా ఆఫర్

‘మిరాయ్’ విజయంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ మొత్తం దృష్టి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనిపై పడింది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూపించి, మొదటి రెండు రోజుల్లోనే రూ.55 కోట్ల గ్రాస్ రాబట్టిన ఘనత కార్తీక్ ఘట్టమనేని సొంతం చేసుకున్నాడు. ‘మిరాయ్‘ సినిమాకి దర్శకుడిగానే కాకుండా సినిమాటోగ్రాఫర్ గానూ వ్యవహరించాడు కార్తీక్.
అనంతపురానికి చెందిన కార్తీక్, సినిమాల మీద ప్యాషన్‌తో సినీమాటోగ్రఫీ నేర్చుకున్నాడు. రాజీవ్ మీనన్ మైండ్‌స్క్రీన్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ పూర్తిచేసి, 2013లో ‘ప్రేమ ఇష్క్ కాదల్’తో కెమెరామెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ‘కార్తికేయ, ఎక్స్‌ప్రెస్ రాజా, ప్రేమమ్, నిన్నుకోరి, చిత్రలహరి, ధమాకా, కార్తికేయ 2‘ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు.
ఒకవైపు సినిమాటోగ్రాఫర్ గా చేస్తూనే మరోవైపు దర్శకుడిగా ‘సూర్య వర్సెస్ సూర్య, ఈగల్‘ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. అయితే.. ఇప్పుడు ‘మిరాయ్‘ డైరెక్టర్ గా కార్తీక్ హిట్ అందుకున్నాడు. ‘మిరాయ్‘ తర్వాత సీక్వెల్ కూడా లైన్లో ఉంది. అయితే.. ‘మిరాయ్ 2‘ పట్టాలెక్కడానికి సమయం పడుతుందట. ఈలోపులో మెగాస్టార్ చిరంజీవి సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడట కార్తీక్ ఘట్టమనేని.
‘వాల్తేరు వీరయ్య’ విజయానంతరం మరోసారి చిరంజీవి – బాబీ కాంబినేషన్ రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా కార్తీక్ ఘట్టమనేనిను దాదాపుగా లాక్ చేశారు. ఇదే విషయాన్ని లేటెస్ట్ గా కార్తీక్ కూడా కన్ఫమ్ చేశాడు. మొత్తంగా.. చిరు-బాబీ మూవీకి టెక్నికల్ గా కార్తీక్ ఘట్టమనేని పనిచేయడం ఎంతో ప్లస్ కానుంది.
-
Home
-
Menu