'మీసాల పిల్ల' వచ్చేసింది!

X
మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' పాటల పండగ మొదలైంది. ఈరోజు దసరా సందర్భంగా ఈ చిత్రం నుంచి 'మీసాల పిల్ల' అంటూ సాగే టీజింగ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' పాటల పండగ మొదలైంది. ఈరోజు దసరా సందర్భంగా ఈ చిత్రం నుంచి 'మీసాల పిల్ల' అంటూ సాగే టీజింగ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. భీమ్స్ మ్యూజిక్ లో భాస్కరభట్ల రాసిన ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు.
చిరంజీవి, నయనతార లపై చిత్రీకరించిన ఈ గీతాన్ని విజయ్ పోలకి కొరియోగ్రాఫ్ చేశాడు. ఈ ప్రోమోలో చూపించిన రెండు, మూడు స్టెప్పుల్లోనే మెగాస్టార్ తనదైన గ్రేస్ తో అదరగొట్టాడు. స్టైలిష్ గా స్లిమ్ లుక్ లో కనిపిస్తున్న చిరు, నయనతార జోడీ బాగుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Next Story
-
Home
-
Menu