మెగాస్టార్‌కి విలన్‌గా మనోజ్?

మెగాస్టార్‌కి విలన్‌గా మనోజ్?
X
తెలుగు సినిమాల్లో హీరోలు విలన్‌గా కనిపించడం కొత్తేమీ కాదు. అయితే కొందరు హీరోలు విలన్ రోల్స్‌లో చేస్తే ప్రత్యేకంగా నిలుస్తారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్.

తెలుగు సినిమాల్లో హీరోలు విలన్‌గా కనిపించడం కొత్తేమీ కాదు. అయితే కొందరు హీరోలు విలన్ రోల్స్‌లో చేస్తే ప్రత్యేకంగా నిలుస్తారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత 'భైరవం'తో రీ-ఎంట్రీ ఇచ్చిన మనోజ్, ఆ సినిమాలో నెగిటివ్ రోల్‌తో తనలోని మరో యాంగిల్ ను చూపించాడు. లేటెస్ట్ గా రిలీజైన 'మిరాయ్' మనోజ్ ను మరింత పవర్‌ఫుల్ విలన్ గా ఎస్టాబ్లిష్ చేసింది.

తేజ సజ్జ హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన 'మిరాయ్'లో బ్లాక్ స్వార్డ్ విలన్‌గా మనోజ్ అదరగొట్టాడు. 'మిరాయ్'లో విలన్ గా స్క్రీన్ ను డామినేట్ చేసిన మనోజ్ గురించి ఇండస్ట్రీలో ఇప్పుడొక క్రేజీ రూమర్ పుట్టుకొచ్చింది. చిరంజీవి-బాబీ సినిమాలో విలన్‌గా మనోజ్ కనిపించనున్నాడనేదే ఆ న్యూస్.

ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య' వంటి హిట్ అందుకున్న ఈ కాంబో మరో సినిమాకి పని చేయబోతున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా 'మిరాయ్' డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని పనిచేస్తుండటం కూడా.. మనోజ్ ఈ మూవీలో విలన్ గా నటించబోతున్నాడనే న్యూస్ కు బలం చేకూరుస్తుంది.

ఇక్కడ మరో స్పెషల్ కనెక్షన్ ఏమిటంటే.. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, మనోజ్ తండ్రి మోహన్ బాబు హీరోలుగా కలిసి సినిమాలు చేశారు. అలాగే.. చిరంజీవికి విలన్ గా మోహన్ బాబు నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే బాటలో ఆయన తనయుడు మనోజ్ విలన్‌గా వస్తే? ఇది నిజంగా క్రేజీ కాంబినేషన్ అవుతుంది.

Tags

Next Story