వెండితెరపై మణిరత్నం మాయాజాలం!

వెండితెరపై మణిరత్నం మాయాజాలం!
X
భారతీయ సినీ ప్రపంచానికే కొత్త ఒరవడి నేర్పిన పేరు మణిరత్నం. మణిరత్నం సినిమాల్లో ఎప్పుడు రక్తపాతం, మెలోడ్రామా ఎక్కువగా ఉండదు. కానీ ప్రేక్షకుడి గుండెని తాకే భావోద్వేగాలు ఉంటాయి.

భారతీయ సినీ ప్రపంచానికే కొత్త ఒరవడి నేర్పిన పేరు మణిరత్నం. మణిరత్నం సినిమాల్లో ఎప్పుడు రక్తపాతం, మెలోడ్రామా ఎక్కువగా ఉండదు. కానీ ప్రేక్షకుడి గుండెని తాకే భావోద్వేగాలు ఉంటాయి. మాటల్లో కాకపోయినా, సినిమాటిక్ లాంగ్వేజ్‌ ద్వారా భావాలను పరాకాష్టకు తీసుకెళ్లగల శక్తి ఆయనది. డైలాగుల కన్నా ఫ్రేముల ద్వారా భావాలను చెప్పడంలో నిపుణుడు. ఆయన సినిమాల్లో ప్రతి షాట్ ఒక పెయింటింగ్‌లా ఉంటుంది. రంగుల వాడకం, లైట్ అండ్ షాడో ప్లే, కెమెరా యాంగిల్స్ అన్నీ కథకు అనుగుణంగా రూపుదిద్దుకుంటాయి.

మణిరత్నం 1983లో కన్నడ చిత్రం ‘పల్లవి అనుపల్లవి’తో దర్శకుడిగా మారాడు. కానీ తొలి సినిమాయే ఫ్లాప్. ఆ తర్వాత మలయాళంలో మోహన్ లాల్ తో 'ఉనరూ' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అదీ ఫ్లాప్. అలా వరుసగా నాలుగు ఫ్లాపుల తర్వాత వచ్చిన చిత్రం 'మౌనరాగం'. అప్పటివరకు తమిళ సినిమా ప్రేక్షకులు చూడని ఓ సరికొత్త ప్రేమకథను 'మౌనరాగం'లో ఆవిష్కరించాడు మణిరత్నం.

1986లో ‘మౌనరాగం’ మొదలుకొని.. ‘నాయకుడు, ఘర్షణ, గీతాంజలి, అంజలి, దళపతి, రోజా’ వరకూ ఒక సినిమాకి మించి మరొకటి విజయాలు సాధించాయి. రివార్డులే కాదు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న చిత్రాలుగా ఈ సినిమాలు నిలిచాయి. ఇక.. దర్శకత్వంలో మణిరత్నం టేకింగ్ కు ఫిదా అవ్వని ఫిల్మ్ మేకర్స్ లేరు. ఎంతోమంది ఔత్సాహిక దర్శకులు.. మణిరత్నం ను ప్రేరణగా తీసుకునే చిత్ర రంగంలోకి ప్రవేశించారు.

ఇక సౌతిండియా సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్ లో.. ఇప్పటికీ ఫుల్ యాక్టివ్ గా ఉన్న దర్శకుడెవరంటే మణిరత్నం పేరే ముందుగా చెప్పాలి. 'పొన్నియన్ సెల్వన్' సిరీస్ తర్వాత ఇప్పుడు మణిరత్నం నుంచి 'థగ్ లైఫ్' చిత్రం వస్తోంది. 'నాయకుడు' తర్వాత కమల్-మణి కలయికలో రూపొందిన సినిమా ఇది. ఈరోజు (జూన్ 2) మణిరత్నం పుట్టినరోజు. ఈ సందర్భంగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంకు బర్త్ డే విషెస్ తెలియజేస్తుంది తెలుగు 70 ఎమ్.ఎమ్.

Tags

Next Story