‘మన శంకరవరప్రసాద్ గారు‘ వచ్చేశారు!

X
మెగాస్టార్ చిరంజీవి, అపజయమెరుగని అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న ‘మెగా 157‘ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.
మెగాస్టార్ చిరంజీవి, అపజయమెరుగని అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న ‘మెగా 157‘ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది. ఇప్పటివరకూ ప్రచారంలో ఉన్న ‘మన శంకరవరప్రసాద్ గారు‘ టైటిల్ నే ఈ మూవీకి ఫిక్స్ చేశారు. చిరంజీవి నటించిన 156 సినిమాలకు సంబంధించి ఫోటోలతో వైవిధ్యంగా తయారు చేసిన ఈ టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది.
ఇక ఈ గ్లింప్స్ లో చిరంజీవి స్టైలిష్ లుక్స్ లో అదరగొడుతున్నాడు. ‘మనశంకరవరప్రసాద్ గారు.. పండక్కి వస్తున్నారు‘ అంటూ రిలీజ్ డేట్ పైనా మరసారి క్లారిటీ ఇచ్చేశారు. చిరు, నయనతార జంటగా నటిస్తున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.
Next Story
-
Home
-
Menu