మహేష్ పాస్‌పోర్ట్ కథ

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ SSMB29. ఇప్పటికే పట్టాలెక్కిన ఈ చిత్రం సైలెంట్‌గా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. ఇటీవల ఒడిశాలో ఈ సినిమాకోసం కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. లేటెస్ట్‌గా ఈ మూవీ షెడ్యూల్ గ్యాప్‌లో మహేష్ తన ఫ్యామిలీతో విదేశీ ట్రిప్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.
గతంలో SSMB29ని ప్రమోట్ చేసే క్రమంలో దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ పాస్‌పోర్టు లాక్కున్నట్టుగా ఒక ఫన్నీ వీడియోను షేర్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సింహాన్ని(మహేష్ బాబు) బోనులో బంధించినట్టు స్టైల్లో ఫోటోకు పోజిచ్చిన జక్కన్న, తనదైన హ్యూమర్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.
లేటెస్ట్‌గా విమానాశ్రయంలో మహేష్ తన పాస్‌పోర్టును చూపించిన వీడియో వైరల్ అవుతుండటంతో, జక్కన్న నుంచి సూపర్ స్టార్ కి విముక్తి లభించిందనే కామెంట్స్ తో నెటిజన్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు.
Passport is back to @urstrulyMahesh hand 😎🔥#SSMB29 #MaheshBabu pic.twitter.com/Jp5dvepga9
— KonaseemaSSMBFC (@KonaseemaSSMBFC) April 5, 2025
-
Home
-
Menu