'ఖలేజా' చూపిస్తున్న మహేష్!

2010లో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో విడుదలైన ‘ఖలేజా’ సినిమా మొదట బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినా, అప్పట్లో కేవలం రూ.18 కోట్ల షేర్‌ను మాత్రమే రాబట్టగలిగింది. కానీ కాలక్రమంలో ఈ చిత్రానికి కల్ట్ స్టేటస్ లభించింది. టీవీ టెలికాస్ట్స్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా క్రేజ్ పెరిగి, ఓ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది.
ప్రస్తుతం కొనసాగుతున్న రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా మే 30న 'ఖలేజా' 4K వెర్షన్‌లో రీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం టికెట్ బుకింగ్‌లకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. బుక్ మై షోలో గంటకు 13,000-14,000 టికెట్లు అమ్ముడవుతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ సమయంలోగానీ, ఇతర రీ రిలీజ్ సినిమాల్లోగానీ ఇంత హైప్ చూడలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది రీరిలీజ్ మూవీకి సరికొత్త రికార్డు.
ఖలేజా కథ విషయానికొస్తే ఇందులో మహేష్ బాబు సీతారామరాజు అనే ట్యాక్సీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడు. ఓ చిన్న గ్రామమైన పాలిలో వరుసగా అనూహ్య మరణాలు జరుగుతుంటాయి. గ్రామస్తులు దేవుడు వచ్చి తమను కాపాడతాడని విశ్వసిస్తారు. కథానాయకుడు వారిని దేవుడిలా కాపాడాడా? అన్నదే కథ. మహేష్ బాబు కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ డైలాగ్స్, అనుష్క అందాలు, ప్రకాష్ రాజ్ విలనిజం, మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి.
ఈ సినిమాకు ఇప్పటికే కల్ట్ ఫాలోయింగ్ ఉండటంతో, రీ రిలీజ్ విషయంలో అభిమానులు భారీ ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ రైట్స్ కూడా రూ.2 కోట్లకు అమ్ముడయ్యాయట. ఆంధ్రా, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ఈ రైట్స్‌ను పొందటం విశేషం.
-
Home
-
Menu