సంక్రాంతి బరిలో మహేష్-రాజమౌళి?

సంక్రాంతి బరిలో మహేష్-రాజమౌళి?
X
సూపర్‌స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న పాన్ వరల్డ్ లెవెల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'SSMB29'. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలలో కీలక షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం లేటెస్ట్ గా కెన్యా, నైరోబిలలో కొత్త షెడ్యూల్స్ మొదలు పెట్టుకుంది.

ఆగస్టు 9న మహేష్ బర్త్‌డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి ఓ లుక్ రిలీజ్ చేశారు. అయితే.. ఇందులో మహేష్ ఫేస్ రివీల్ చేయలేదు. ఇక నవంబర్ లో ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు గ్లింప్స్‌, రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందని టాక్. అంతేకాదు, హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా ఈ గ్లింప్స్ విడుదల చేసే ప్రణాళిక కూడా ఉందట. 2027 సంక్రాంతికి ఈ సినిమాను గ్లోబల్‌గా రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆఫ్రికన్ అడవుల బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో రామాయణం, సంజీవని లాంటి అంశాలు కూడా మిళితం కానున్నాయని సమాచారం. కొన్ని సీన్స్‌లో మహేష్ బాబు రాముడి గెటప్‌లో కనిపిస్తాడని బజ్. అలాగే ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, డైనోసార్స్ తో సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయట.

ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లతో పాటు మాధవన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో రిలీజ్ చేసే ప్లాన్‌తో మేకర్స్ ముందుకు వెళ్తున్నారు. రాజమౌళి ప్రత్యేక శైలి, మహేష్ గ్లోబల్ లుక్‌తో ఈ సినిమా నిజంగా ఒక విజువల్ స్పెక్టకిల్ అవ్వడం ఖాయం అన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

Tags

Next Story