మహేష్, ప్రియాంక ఫోటో వైరల్

మహేష్, ప్రియాంక ఫోటో వైరల్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘SSMB29’. యాక్షన్ అడ్వెంచర్ డ్రామా తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘SSMB29’. యాక్షన్ అడ్వెంచర్ డ్రామా తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మహేష్, ప్రియాంక కలిసున్న ఫోటో ఒకటి లీకైంది.

ఆగస్టు 9న మహేష్ బర్త్‌డే సెలబ్రేషన్స్ లోని ఫోటోగా ఇది ప్రచారమవుతుంది. ఈ ఫొటోలో మహేష్ బాబు క్యాప్ పెట్టుకొని టీ-షర్ట్‌లో కూల్ లుక్‌లో కనిపించగా, ప్రియాంకా చోప్రా స్లీవ్‌లెస్ టాప్‌లో హ్యాపీ మూడ్‌లో మెరిసింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘SSMB29’ మూవీని మైథలాజికల్ టచ్ తో ఫారెస్ట్ అడ్వెంచర్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నాడట రాజమౌళి. ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్‌లో సూపర్ స్టార్ ఫేస్ ను పూర్తిగా రివీల్ చేయలేదు. గ్లోబ్ ట్రాటర్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ను నవంబర్ లో రిలీజ్ చేయబోతున్నారు. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Next Story