'లిటిల్ హార్ట్స్' రివ్యూ

లిటిల్ హార్ట్స్ రివ్యూ
X
సోషల్ మీడియా స్టార్ మౌళి హీరోగా నటించిన సినిమా ‘లిటిల్ హార్ట్స్‘. యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం రూపొందింది. ఆదిత్య హాసన్ నిర్మాణంలో బ‌న్నీ వాస్ వ‌ర్క్స్‌, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. మరి.. ఈరోజు విడుదలైన ‘లిటిల్ హార్ట్స్‘ ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

నటీనటులు: మౌళి తనుజ్, శివాని నాగరం, రాజీవ్ కనకాల, కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ తదితరులు

సినిమాటోగ్రఫీ: సూర్య బాలాజి

సంగీతం: సింజిత్ యెర్రమిల్లి

ఎడిటింగ్ : శ్రీధర్ సొంపల్లి

నిర్మాత: ఆదిత్య హాసన్

దర్శకత్వం: సాయి మార్తాండ్

విడుదల తేది: సెప్టెంబర్ 5, 2025

సోషల్ మీడియా స్టార్ మౌళి హీరోగా నటించిన సినిమా ‘లిటిల్ హార్ట్స్‘. యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం రూపొందింది. ఆదిత్య హాసన్ నిర్మాణంలో బ‌న్నీ వాస్ వ‌ర్క్స్‌, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. మరి.. ఈరోజు విడుదలైన ‘లిటిల్ హార్ట్స్‘ ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

అఖిల్‌ (మౌళి తనూజ్) చదువుల్లో అంతంత మాత్రమే. పేమెంట్ సీటుతో ఇంజినీరింగ్‌లో చేరాలనుకున్నా, అతని తండ్రి గోపాలరావు (రాజీవ్ కనకాల) మాత్రం తన కొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో పాటు మ్యూజిక్ కంపోజర్ కావాలని కలలు కంటాడు. అందుకే కొడుకును లాంగ్‌టర్మ్ కోచింగ్‌కి పంపిస్తాడు.

ఇదే సమయంలో కాత్యాయనీ (శివానీ నాగారం) జీవితమూ దాదాపు అదే విధంగా సాగుతుంది. తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లు కావడంతో ఆమెను కూడా డాక్టర్ చేయాలని ఆశపడతారు. కానీ మెడిసిన్ సీట్ దక్కకపోవడంతో, బలవంతంగా లాంగ్‌టర్మ్ కోచింగ్‌లో చేరుతుంది.

అక్కడే అఖిల్ – కాత్యాయనీ పరిచయం మొదలై, క్రమంగా ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే ఈ ప్రేమలోకి అడుగు పెట్టే ముందు అఖిల్‌కి ఒకసారి లవ్‌లో నిరాశ ఎదురవుతుంది. అయినా కాత్యాయనీ ప్రేమను గెలుచుకోవాలని అతడు ప్రయత్నిస్తాడు. చివరికి కాత్యాయనీ తన జీవితానికి సంబంధించి ఓ షాకింగ్ నిజాన్ని అఖిల్ ముందు ఉంచుతుంది.

మరి.. చదువుల ఒత్తిడి, తల్లిదండ్రుల కలలు, వ్యక్తిగత అభిరుచులు – వీటన్నిటి మధ్య అఖిల్ – కాత్యాయనీ ప్రేమకథ ఎటువంటి మలుపు తిరిగింది? వారి ప్రేమకు హ్యాపీ ఎండింగ్ దక్కిందా? లేదా? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ

తల్లిదండ్రులు నిర్ణయించిన చదువులకంటే పిల్లలకు ఉండే ఇష్టాలు, ఆసక్తులు వేరు. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటం వల్లే చాలా మంది యువతీ యువకుల జీవితాలు ఒక కొత్త మలుపు తిరుగుతుంటాయి. అలాంటి కథతోనే ఈ సినిమా సాగుతుంది.

90స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘లిటిల్ హార్ట్స్‘ సినిమా, మన తెలుగు యువతకి ఆ కాలం వాతావరణాన్ని గుర్తు చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తుంది. కథాపరంగా చెప్పుకుంటే, ఇది రొటీన్ టీనేజ్ లవ్ స్టోరీ. కానీ దర్శకుడు సాయి మార్తండ రాసుకొన్న సన్నివేశాలు, పంచ్ డైలాగ్స్, వన్ లైనర్స్ సినిమాను హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా మార్చాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలపై ఎంసెట్, ఇంజినీరింగ్, మెడిసిన్ ఒత్తిడి చేయడం – నేటి కాలానికి కూడా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఫ్రెండ్స్ గ్రూప్ మధ్య సాగే ఫన్ సీన్స్ అయితే ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి.

ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌లలోనూ పెద్దగా బోర్ లేకుండా, పాత రోజులు గుర్తు చేసేలా సినిమా సాగింది. అయితే సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. కథ బలంగా లేకపోవడం, ఎమోషనల్ ట్రాక్ లేకపోవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌కు కొంత లోటు అనిపిస్తుంది.

సెకండాఫ్‌లో కథ కొంచెం లాగినట్టు అనిపిస్తుంది. పిల్లలతో చేసిన కొన్ని సీన్స్ ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. టైమ్‌లైన్ 15 ఏళ్ల వెనక్కి తీసుకున్నప్పటికీ టెక్నికల్ డీటైల్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్‌గా ‘లిటిల్ హార్ట్స్‘ కొత్తదనం కోరుకునే వారికి కాదు. కానీ, పంచ్‌లతో, కామెడీ సన్నివేశాలతో, ఫీల్‌గుడ్ మూడ్‌తో నడిచే క్లీన్ ఎంటర్‌టైనర్ కావడంతో యువతరాన్ని బాగా అలరించే సినిమా ఇది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

హీరో మౌళి విషయంలో ఎక్కడా నిరాశ కలిగించలేదని చెప్పాలి. తన సిల్వర్ స్క్రీన్ డెబ్యూ చాలా డీసెంట్‌గా, ఫన్నీగా కనిపించింది. సాలిడ్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. సెకండాఫ్‌లో తనపై వచ్చిన ఒక సాంగ్ ఎపిసోడ్ అయితే హిలేరియస్‌గా వర్కౌట్ అయ్యింది.

అతనికి జోడీగా శివాని నాగారం ఆకట్టుకుంది. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘ తర్వాత మరో మంచి రోల్‌ తో అలరించింది శివాని. ఈ సినిమాలో ఆమె లుక్స్, నటన పలు టైమ్‌లైన్స్‌లో పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. మౌళితో పాటు కనిపించే మరో యువ నటుడు జై కృష్ణ కూడా సాలిడ్ కామెడీ టైమింగ్, మంచి నటనతో ఆకట్టుకున్నాడు.

సీనియర్ నటుల విషయానికి వస్తే – రాజీవ్ కనకాల తన కొడుకు చదువు విషయంలో ఆరాటపడే తండ్రిగా మంచి రోల్ చేశాడు. అలాగే ఎస్.ఎస్. కాంచి, అనిత చౌదరి, సత్యకృష్ణన్ వంటి వారు తమ పాత్రల్లో బాగా చేశారు.

టెక్నికల్ గా ‘లిటిల్ హార్ట్స్‘ బలంగా నిలిచింది. దర్శకుడు సాయి మార్తాండ్ తెలిసిన కథనే సరదాగా, మంచి హాస్యంతో తెరపైకి తీసుకువచ్చాడు. డైలాగ్స్ సినిమాకి అత్యంత బలంగా నిలిచాయి. సింజిత్ యర్రమిల్లి ఇచ్చిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోశాయి. కాత్యాయని సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే కొన్ని పాటల ప్లేస్‌మెంట్ కారణంగా కామెడీ ఫ్లో కొంచెం తగ్గిన ఫీలింగ్ కలిగిస్తుంది. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ ఫీల్‌గుడ్‌గా ఆకట్టుకుంటుంది. సైనిక్‌పురి, మల్కాజిగిరి నేటివిటీని అందంగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా

యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే ‘లిటిల్ హార్ట్స్‘


Tags

Next Story