లెజెండరీ సంక్రాంతి క్లాష్?

లెజెండరీ సంక్రాంతి క్లాష్?
X
సంక్రాంతి సీజన్లలో కోడిపుంజుల్లా పోటీపడ్డ హీరోలంటే ముందుగా గుర్తొచ్చేది చిరంజీవి - బాలకృష్ణ.

సంక్రాంతి సీజన్లలో కోడిపుంజుల్లా పోటీపడ్డ హీరోలంటే ముందుగా గుర్తొచ్చేది చిరంజీవి - బాలకృష్ణ. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి స్టార్ వార్ కొనసాగిస్తున్న ఈ సీనియర్ హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పలుమార్లు పోటీలో ఉన్నా.. సంక్రాంతి సీజన్ లో అయితే ఇప్పటివరకూ తొమ్మిది సార్లు తలపడ్డారు.

చివరగా 2023 సంక్రాంతి బరిలో బాలకృష్ణ 'వీరసింహారెడ్డి', చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' ఒక్కరోజు గ్యాప్ లో వచ్చి బ్లాక్ బస్టర్స్ సాధించాయి. ఇప్పుడు వచ్చే సంక్రాంతి బరిలో పదోసారి పోటీ పడడానికి సిద్ధమవుతున్నారట ఈ లెజెండరీ యాక్టర్స్.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించే సినిమా వచ్చే సంక్రాంతి బరిలో విడుదల తేదీ ఖరారు చేసుకుంది. మరోవైపు బాలకృష్ణ మోస్ట్ అవైటింగ్ మూవీ 'అఖండ 2' కూడా వచ్చే సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయట. అసలు ఈ ఏడాది దసరా కానుకగా 'అఖండ 2' విడుదల తేదీ ఖరారు చేసుకుంది. అయితే ఆ సమయానికి ఈ చిత్రం పూర్తవ్వడం కష్టమే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో వచ్చే సంక్రాంతి బరిలోనే 'అఖండ 2' వచ్చే అవకాశాలు ఉన్నాయట.

మరోవైపు తమిళం నుంచి విజయ్ 'జననాయగన్' కూడా పొంగల్ రేసులో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. 2023 సంక్రాంతి బరిలో చిరు 'వాల్తేరు వీరయ్య', బాలయ్య 'వీరసింహారెడ్డి'లతో పాటు విజయ్ 'వారసుడు' విడుదలైన విషయం తెలిసిందే. అంటే.. ఈ ముగ్గురూ మరోసారి 2026 సంక్రాంతి బరిలో తలపడబోతున్నారనేది మరో కోణం.

Tags

Next Story