'కుబేర' సక్సెస్ మీట్ హైలైట్స్!

నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'కుబేర' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం దిశగా దూసుకెళ్తుంది. ఈనేపథ్యంలో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సక్సెస్ మీట్ లో ధనుష్ మాట్లాడుతూ.. 'ఇప్పుడు థియేటర్లలో జనాల్ని రప్పించాలంటే యాక్షన్ ఒకటే మార్గం అన్న అపవాదును శేఖర్ కమ్ముల గారు తొలగించారు. ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి కారణం ఇందులోని ఎమోషన్. డైరెక్టర్ శేఖర్ గారు హ్యూమన్ ఎమోషన్లను ఎంతో గ్రాండ్‌గా చూపించారు. థ్యాంక్స్ టు ఎవ్రీవన్' అని అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ.. 'ఈ సినిమా నా సినిమానే కదా అనుకుని చేశా' అన్నాను.. అదే మాట పట్టుకుని, రిలీజ్‌కి ముందు 'శేఖర్ కమ్ముల సినిమా' అన్నాడని, రిలీజ్ తర్వాత 'తన సినిమా అంటున్నాడంటూ' సోషల్ మీడియాలో వేసేశారు.' అంటూ కొంతమంది ట్రోలర్స్ పై పంచ్ వేశారు కింగ్. అలాగే ధనుష్‌ను చూస్తూ 'నాలుగు నేషనల్ అవార్డులు వచ్చాయ్.. నీ గురించి ఇంకేం చెప్పాలి?' అని ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ 'రష్మిక రోజు రోజుకూ ఇంటర్నేషనల్ క్రష్ లాగా ఎదుగుతోంది. ఈ సినిమాలో ఆమె చూపిన ఇంటెన్స్, ఇంటెన్సిటీ ఉన్న పాత్ర చూసి నాకు సౌందర్య గారిని గుర్తుకు తెచ్చింది' అన్నారు. శేఖర్ కమ్ముల గురించి మాట్లాడుతూ '25 ఏళ్లలో కేవలం 10 సినిమాలు చేసినా, ప్రతి చిత్రం ఆణిముత్యంలా ఉంటుంది. 'కుబేర'తో తన క్లాస్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు' అని పేర్కొన్నారు మెగాస్టార్.
ధనుష్ నటనను కొనియాడుతూ, 'ఒకే ఒక నటుడు మాత్రమే ఈ ‘దేవా’ పాత్రని పండించగలడు… అది ధనుష్ మాత్రమే! అతను ఆ పాత్రలో అద్భుతంగా జీవించాడు. నాకు ఆ పాత్ర వచ్చినా నేనిలా చేయలేనేమో అనిపించింది. మళ్లీ ఒక నేషనల్ అవార్డు అతని సొంతమవుతుంది, కచ్చితంగా' అంటూ ధనుష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక నాగార్జునను ఉద్దేశించి 'నాగ్, మీ దారిలో నేను నడుస్తాను' అని అన్నారు చిరంజీవి.
-
Home
-
Menu