మళ్లీ బాలయ్యతో క్రిష్

నందమూరి బాలకృష్ణ ప్రతిష్ఠాత్మక వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'ని తీర్చిదిద్దింది దర్శకుడు క్రిష్. ఆ తర్వాత నందమూరి కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన 'యన్.టి.ఆర్' బయోపిక్ ను సైతం క్రిష్ తెరకెక్కించడం విశేషం. ఇప్పుడు మరోసారి బాలయ్య కోసం డైరెక్టర్ గా రంగంలోకి దిగుతున్నాడట క్రిష్. ఈసారి వీరు కలిసి చేయబోయే ప్రాజెక్ట్ 'ఆదిత్య 999' కావొచ్చనే ప్రచారం జరుగుతుంది.
'ఆదిత్య 369'కి సీక్వెల్ గా 'ఆదిత్య 999' చేయాలని బాలకృష్ణ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. అందుకు సంబంధించిన కథను కూడా సిద్ధం చేశాడు. తన దర్శకత్వంలో ఈ సినిమాని తీర్చిదిద్దాలనేది బాలయ్య కోరిక. కానీ.. ఇప్పుడు 'ఆదిత్య 999' దర్శకత్వ బాధ్యతలను క్రిష్ కి అప్పగించబోతున్నాడట.
'బాహుబలి' చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. బాలయ్య వారసుడు మోక్షఙ్ఞ కూడా ఇదే సినిమాతో డెబ్యూ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం 'అఖండ 2'తో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఈ ఏడాది జూన్ లో మలినేని గోపీచంద్ తో కొత్త సినిమాని షురూ చేస్తాడు. ఇక ఈ ఏడాది చివరి నుంచి క్రిష్ మూవీని తెరపైకి ఎక్కించడానికి ప్రణాళికలు చేస్తున్నాడట. మరోవైపు క్రిష్ దర్శకత్వం వహించిన అనుష్క 'ఘాటి' త్వరలో విడుదలకు ముస్తాబవుతుంది.
-
Home
-
Menu