కోట శ్రీనివాసరావు కన్నుమూత!

కోట శ్రీనివాసరావు కన్నుమూత!
X
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అస్వస్థత తో భాధపడుతూ తుది శ్వాస విడిచారు.

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అస్వస్థత తో భాధపడుతూ తుది శ్వాస విడిచారు. నాలుగున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు కోట శ్రీనివాసరావు.

తెలుగు సినీ పరిశ్రమకు కోట శ్రీనివాసరావు ఓ అమూల్యమైన ఆణిముత్యం. రంగస్థలంపై సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, 750కు పైగా సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. క్రూరమైన విలన్, హాస్య విలన్, తండ్రి పాత్రలు, కారక్టర్ రోల్స్ – పాత్ర ఏదైనా తనదైన శైలిలో శాతం కాదు.. నూట యాభై శాతం న్యాయం చేస్తారు.

కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో జన్మించిన కోట, బ్యాంక్ ఉద్యోగం చేస్తూ నాటకాల్లో నటిస్తూ చివరికి సినిమాల్లో అడుగుపెట్టారు. రామ్ గోపాల్ వర్మ 'మనీ' లో ఆయన నటనకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ‘గణేష్’ లో విలన్‌గా ఆయన నటన తెలుగు సినిమాలో విలనిజానికి కొత్త మలుపు తీసుకువచ్చింది.

కోట సైగలే కామెడీ పేలుస్తాయి, మాటలే భావోద్వేగాలు కలిగిస్తాయి. ‘అహనాపెళ్లంట, బావగారూ బావున్నారా, బృందావనం’ వంటి సినిమాల్లో ఆయన నటన అసాధారణం. బాబూ మోహన్‌తో జోడీగా ఎన్నో కామెడీ సన్నివేశాల్లో ఆడియన్స్‌ను నవ్వుల్లో ముంచెత్తారు. ‘గబ్బర్ సింగ్’ లో కోట పాడిన పాటకు సైతం విశేష ఆదరణ లభించింది.

కోట కథానాయకుడిగానైతే కనిపించకపోయినా, ప్రతి ఇతర పాత్రలో ప్రాణం పోస్తారు. దర్శకుడు ఊహించినంతలో కాదు.. ఊహించని స్థాయిలో నటించగల శక్తి ఆయనది. రాజకీయాల్లోకి వెళ్లినా సినిమానే ఆయన్ను ఆకర్షించింది. కోట మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి లో తెలుగు సినీ పరిశ్రమ. విచారం వ్యక్తం చేస్తున్న పలువురు సినీ ప్రముఖులు.

Tags

Next Story