
రేసులో వెనుకబడ్డ కోలీవుడ్

ప్రస్తుతం భారతీయ సినిమా రంగంలో సౌత్ ఇండస్ట్రీ దూసుకెళ్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ ఆధిపత్యం చూపిన రోజులు పోయి, ఇప్పుడు దక్షిణాదే పాన్ ఇండియా మార్కెట్‌ని నడిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలు తమ సరికొత్త కంటెంట్, టెక్నికల్ వేల్యూస్, గ్లోబల్ స్టాండర్డ్స్‌తో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్నాయి.
తెలుగు సినిమా గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా ఫ్లేవర్‌ని బాగా ఎంజాయ్ చేస్తోంది. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, సలార్, హనుమాన్, మిరాయ్’ వంటి సినిమాలు భారతీయ బాక్సాఫీస్ దిశనే మార్చేశాయి. కథల వైవిధ్యం, భారీ ప్రొడక్షన్ వేల్యూస్, గ్లోబల్ ప్రమోషన్ టెక్నిక్స్‌తో టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా మేకర్స్‌కు హబ్‌గా మారింది.
ఇక కన్నడ సినిమా విషయానికి వస్తే — ‘కె.జి.యఫ్, కాంతార, మహావతార్’ వంటి చిత్రాల విజయాలు ఉదాహరణలు. సాంప్రదాయానికి సరికొత్త దృక్పథం జోడించి, స్థానికతతో కూడిన కథల్ని దేశవ్యాప్తంగా హిట్ చేయడంలో శాండల్‌వుడ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అదే సమయంలో మలయాళ పరిశ్రమ క్వాలిటీ కంటెంట్‌తో అద్భుతాలు చేస్తోంది. ‘లోక: చాప్టర్ 1 – చంద్ర’ వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మలయాళ సినిమాకు కొత్త గౌరవం తెచ్చాయి. తక్కువ బడ్జెట్‌లోను ప్రపంచ స్థాయి విజువల్ ప్రెజెంటేషన్ ఇవ్వగల సామర్థ్యం మాలీవుడ్‌కు ఉంది.
కానీ విచారకరం ఏమిటంటే — ఒకప్పుడు సౌత్‌కి ఫ్లాగ్‌బేరర్‌గా ఉన్న తమిళ సినిమా పరిశ్రమ ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని కొనసాగించలేకపోతోంది. ‘విక్రమ్, లియో, జైలర్’ వంటి కొన్ని సినిమాలు హిట్ అయినా, పాన్ ఇండియా స్థాయిలో కొత్త మైలురాళ్లు నమోదు చేయలేకపోయాయి. కొలీవుడ్ ఎప్పటిలా ఎక్స్‌పెరిమెంటేషన్ కొనసాగిస్తున్నా, ఆ సినిమాలు యూనివర్సల్ కనెక్ట్ సాధించడంలో విఫలమవుతున్నాయి.
-
Home
-
Menu