‘కిష్కింధపురి’.. వినూత్నమైన హారర్ థ్రిల్లర్

తెలుగు సినిమాల్లో హారర్ జానర్‌కి ఎప్పటినుంచో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే ఒకే విధమైన హారర్ కథలు రావడంతో ఆడియన్స్ కొత్తదనం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ‘కిష్కింధపురి’ కొత్తదనంతో కూడిన హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ కానుంది.
సినిమా కథలోనే ప్రధాన హైలైట్ ఒక రేడియో నుంచి వచ్చే వాయిస్. ఆ వాయిస్‌లో దాగి ఉన్న మిస్టరీ, దాని వెనకున్న హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కొత్త అనుభూతిని అనుభవింపజేస్తాయి అని టీమ్ చెబుతుంది. ఇప్పటివరకు తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు కౌశిక్ ఈ కథను తీర్చిదిద్దాడట.
ఈ సినిమా కోసం నెలరోజులపాటు శ్రమించి, దాదాపు రూ. 2 కోట్లతో ప్రత్యేక రేడియో స్టేషన్ సెట్ వేసారు. కథలోని కీలక సన్నివేశాలన్నీ ఇక్కడే చిత్రీకరించారట. ‘యానిమల్, పుష్ప’ సినిమాలకు పనిచేసిన టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి కూడా పనిచేయడం మరో ప్రత్యేకత. రన్‌టైమ్ కూడా క్రిస్ప్‌గా ఉండేలా చూసారట.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటివరకు మాస్ కమర్షియల్ సినిమాల్లోనే ఎక్కువగా కనిపించాడు. కానీ ఈ సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని చెబుతుంది టీమ్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్‌తో, సెకండ్ హాఫ్ నుంచి హారర్, యాక్షన్ మోడ్‌లోకి మారుతుందట. అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కోసం ప్రత్యేకంగా రాసిన పాత్ర ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని.. పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న రోల్‌లో ఆమె కనిపించనుందని టీమ్ చెబుతుంది.
మరోవైపు 'కిష్కింధపురి' ప్రచారంలో వేగం పెంచింది టీమ్. ఈరోజు విజయవాడలో గ్రాండ్ ఈవెంట్ జరగబోతుంది. ఇక హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మరింత గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత సాహు గారపాటి.
-
Home
-
Menu