‘కింగ్డమ్‘ ఫస్ట్ డే కలెక్షన్స్

‘కింగ్డమ్‘ ఫస్ట్ డే కలెక్షన్స్
X
విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్‘. నిన్న భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్‘. నిన్న భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా అద్భుతమైన వసూళ్లను సాధించింది.

మూవీ టీం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం, ‘కింగ్డమ్‘ తొలి రోజున రూ. 39 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇది విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఓపెనింగ్స్ పరంగా హైయెస్ట్ రికార్డు. నైజాంలో రూ. 4.20 కోట్లు షేర్ వసూలు చేసిన ఈ చిత్రం సీడెడ్ లో రూ.1.70 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.1.16 కోట్లు, గుంటూరు రూ.75 లక్షలు, ఈస్ట్ రూ.74 లక్షలు, కృష్ణా రూ.59 లక్షలు, వెస్ట్ రూ.44 లక్షలు, నెల్లూరు రూ.34 లక్షల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లో రూ. 2.6 కోట్లు పైగా కలెక్ట్ చేసింది.

సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, కామన్ ఆడియెన్స్‌లో పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అనిరుధ్ బీజీఎం ప్రతి సీన్‌కి ప్రాణం పోసింది. కొన్ని ఏరియాల్లో అయితే తొలి రోజుకే 50% రికవరీ పూర్తయ్యిందని నిర్మాత నాగవంశీ తెలిపారు. మొత్తంగా.. ‘కింగ్డమ్‘ వంద కోట్ల క్లబ్ లోకి చేరడం పక్కా అనేది ఇండస్ట్రీ టాక్.

Tags

Next Story