కెన్యా షెడ్యూల్ క్యాన్సిల్?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ డ్రామా SSMB29. ఇప్పటికే ఈ సినిమాకోసం ఒడిశాలో కీలక షెడ్యూల్ పూర్తి చేసిన రాజమౌళి.. హైదరాబాద్ లోనూ వరుస షెడ్యూల్స్ ని ప్లాన్ చేశాడు. ఇటీవల ఈ చిత్రం కోసం వేసిన ప్రత్యేకమైన కాశీ సెట్‌లోనూ షూటింగ్ జరుగుతుంది.
త్వరలో మూవీ టీమ్ కెన్యా వెళ్లాల్సి ఉంది. అక్కడ అడవుల నేపథ్యంలో చిత్రంలోని మేజర్ షూట్ ను ప్లాన్ చేశాడు జక్కన్న. అయితే కెన్యాలో శాంతి భద్రతల సమస్యలు ఉధృతమవుతున్న నేపథ్యంలో అక్కడ షూటింగ్ ను క్యాన్సిల్ చేయాలని భావిస్తోందట టీమ్.
ఇండియాలోనే స్పెషల్ సెట్స్ వేయాలా? లేదా మరో అంతర్జాతీయ లొకేషన్ ఎంచుకోవాలా? అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. మహేష్ బాబుకి జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
-
Home
-
Menu