కార్తీక్-శ్రీలీల ప్రేమాయణం?

కార్తీక్-శ్రీలీల ప్రేమాయణం?
X
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌, టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి.

బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌, టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. తెరపై జంటగా కనిపించే వీరిద్దరూ, తెర వెనుక కూడా ప్రత్యేక అనుబంధాన్ని పంచుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఒక సంఘటన ఆ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది.

ఇటీవల ముంబైలోని కార్తీక్ ఆర్యన్ నివాసంలో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు శ్రీలీల తన కుటుంబంతో కలిసి హాజరైంది. ఇరు కుటుంబాలు ఒకే వేదికపై పండుగ జరుపుకోవడం, కలిసి ఫొటోలు దిగడం ఇప్పుడు బాలీవుడ్–టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా, కార్తీక్–శ్రీలీల తెల్లటి దుస్తుల్లో జంటగా కనిపించడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది.

ఒక ఫోటోలో కార్తీక్ శ్రీలీల తల్లి పక్కన ఉండగా, మరొక ఫోటోలో శ్రీలీల కార్తీక్ తల్లి మాలా తివారీ పక్కన నిలబడి ఉండడం మరింత ఆసక్తిని రేపింది. మరో ఫ్రేమ్‌లో ఇరు కుటుంబ సభ్యులంతా కలిసి పోజులిచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వీరి మధ్య ప్రేమ ఊహాగానాలకు కొత్త ఊతమిస్తున్నాయి. ప్రస్తుతం కార్తీక్–శ్రీలీల జంటగా అనురాగ్ బసు దర్శకత్వంలో ‘ఆషికీ 3‘ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ మొదలైందనేది బాలీవుడ్ టాక్.

Tags

Next Story