బాలకృష్ణకు పోటీగా కార్తీ

కోలీవుడ్ స్టార్ కార్తీ లేటెస్ట్ మూవీ ‘వా వాతియార్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కార్తీకి తెలుగులోనూ మంచి పాపులారిటీ ఉండటంతో ఈ సినిమాని ఇక్కడా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక.. డిసెంబర్ 5న ఇప్పటికే ‘అఖండ 2‘ ఫిక్సవ్వడంతో.. బాలకృష్ణ సినిమాతో కార్తీ మూవీ బాక్సాఫీస్ వార్ కన్ఫమ్ అయినట్టయ్యింది.
‘అఖండ 2‘ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో.. తెలుగు కంటే తమిళంలో కార్తీ సినిమా బాలయ్య చిత్రానికి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. కార్తీకి జోడీగా ఈ చిత్రంలో కృతి శెట్టి నటిస్తోంది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సత్యరాజ్, రాజ్‌కిరణ్, జి.ఎం. సుందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ యాక్షన్ డ్రామాలో కార్తీ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ‘ఖాకీ, సర్ధార్’ చిత్రాలలో పోలీస్ లుక్‌తో ఆకట్టుకున్నాడు కార్తీ. ఇప్పుడు మరోసారి ‘వా వాతియార్‘ కోసం పోలీస్ రోల్ లో అదరగొట్టబోతున్నాడు. ‘ది స్వాగ్ మాస్టర్ ఈజ్ బ్యాక్‘ అంటూ రిలీజ్ చేసిన ‘వా వాతియార్‘ కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
Home
-
Menu