భారీ అంచనాలతో వస్తోన్న 'కాంతార'

భారీ అంచనాలతో వస్తోన్న కాంతార
X
2022లో విడుదలైన ‘కాంతార‘ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యం, గిరిజన సంప్రదాయాలు, దేవతా విశ్వాసాలు కలగలిపిన ఆ కథ అందరినీ ఉర్రూతలూగించింది.

2022లో విడుదలైన ‘కాంతార‘ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యం, గిరిజన సంప్రదాయాలు, దేవతా విశ్వాసాలు కలగలిపిన ఆ కథ అందరినీ ఉర్రూతలూగించింది. ఇప్పుడు అదే సిరీస్‌లో ‘కాంతార చాప్టర్ 1‘ రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని మిస్టిక్ వరల్డ్‌లోకి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు రిషబ్ శెట్టి.

ఇండియన్ మూవీస్ లో సీక్వెల్స్ ట్రెండ్ కు భారీ క్రేజ్ తీసుకొచ్చిన చిత్రం ‘బాహుబలి‘. ఆ తర్వాత ‘కె.జి.యఫ్, పుష్ప‘ రెండేసి భాగాలుగా వచ్చి పాన్ ఇండియా లెవెల్ లో సంచలన విజయాలు సాధించాయి. ఈకోవలోనే ఇప్పుడు భారీ అంచనాలతో ‘కాంతార‘ ప్రీక్వెల్ రెడీ అయ్యింది. దసరా కానుకగా రేపు (అక్టోబర్ 2) వరల్డ్ వైడ్ ‘కాంతార: చాప్టర్ 1‘ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.

రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రాజుల కాలం నాటి కథతో తెరకెక్కింది. రిషబ్ శెట్టికి జోడీగా రుక్మిణి వసంత్ నటించగా.. మరో ప్రధాన పాత్రలో గుల్షన్ దేవయ్య కనిపించబోతున్నాడు.

మొదటి భాగానికి తన సంగీతంతో ప్రాణం పోసిన అజనీష్ లోక్ నాథ్.. ఇప్పుడు ప్రీక్వెల్ కి అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతాన్ని అందించినట్టు ప్రచార చిత్రాలతో అర్థమయ్యింది. టెక్నికల్ గా అరవింద్ ఎస్.కశ్యప్ సినిమాటోగ్రఫీ ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్. తెలుగులోనూ భారీ స్థాయిలో ‘కాంతార: చాప్టర్ 1‘ రిలీజవుతుంది.

Tags

Next Story