400 కోట్ల క్లబ్ లో ‘కాంతార‘

కన్నడ ఇండస్ట్రీ నుంచి వరుస విజయాలు వస్తున్నాయి. ముఖ్యంగా హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘మహావతార్‘ తర్వాత ఇప్పుడు ‘కాంతార చాప్టర్ 1‘ వరల్డ్ వైడ్ గా వసూళ్ల తుఫాన్ సృష్టిస్తుంది. కన్నడ సెన్సేషనల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని రూపొందించాడు. విడుదలైన తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే రూ.427.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో ‘కాంతార‘ ఫస్ట్ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్లను కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ ప్రీక్వెల్ దాటేసింది.
దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, విదేశాల్లో కూడా ‘కాంతార‘ ప్రభంజనం కొనసాగుతోంది. నార్త్ అమెరికా మార్కెట్‌లో 3 మిలియన్ డాలర్లు సాధించి మరో మైలురాయిని చేరుకుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జయరామ్, గుల్షన్ దేవయ్య పాత్రలు ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. అజనీష్ లోక్ నాథ్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. మొత్తంగా.. లాంగ్ రన్ లో ‘కాంతార చాప్టర్ 1‘ ఎలాంటి వసూళ్ల రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
-
Home
-
Menu