'కన్నప్ప' ట్విట్టర్ రివ్యూ

శివ భక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందిన మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘కన్నప్ప’. శ్రీకాళహస్తి క్షేత్రంలోని పురాణ కథను ఆధారంగా చేసుకొని, దేవుడిపై నమ్మకం లేని యోధుడు తిన్నడు (మంచు విష్ణు) ఎలా శివభక్తుడిగా మారాడనే కథాంశంతో సినిమా సాగుతుంది. తన తెగ, ప్రాంతం కోసం పోరాడే తిన్నడు జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు, శివునిపై అతని భక్తిని ఎలా పెంచాయనేది కథలోని ముఖ్యాంశం. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు.
'కన్నప్ప' మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భారీ అంచనాలతో విడుదలైంది. ఇప్పటికే 'కన్నప్ప'కు సంబంధించి అమెరికాలో ప్రీమియర్స్ వేయడంతో ట్విట్టర్ లో రివ్యూలు వస్తున్నాయి. వాటి ప్రకారం సినిమా ఫస్టాఫ్ కొంత నిదానంగా సాగినా, సెకండాఫ్ గ్రిప్పింగ్ గా ఉందనే రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని ప్రీమియర్ షోలు చూసిన వారు చెబుతున్నారు.
క్లైమాక్స్ లో విష్ణు నటన ఆకట్టుకుంటుందని.. మోహన్ లాల్, ప్రభాస్ అతిథి పాత్రలు అదిరిపోయాయని రివ్యూలు చెబుతున్నాయి. ఇక సినిమాలో రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకోలేదని, వీటిని తగ్గించి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భారీ బడ్జెట్ సినిమా అయినప్పటికీ, వీఎఫ్ఎక్స్ నాణ్యత ఆశించిన స్థాయిలో లేదని కొన్ని రివ్యూస్ వస్తున్నాయి. సినిమా లెంత్ ఎక్కువగా అనిపించిందని, 15 నిమిషాలు తగ్గించి ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉండేదని మరికొన్ని రివ్యూలు సూచిస్తున్నాయి.
-
Home
-
Menu