'కన్నప్ప' ఫస్ట్ రివ్యూ!

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కనువిందు చేయబోతుండటంతో 'కన్నప్ప'పై పాన్ ఇండియా లెవెల్ లో బజ్ ఏర్పడింది. ఇక విడుదలకు కొన్ని గంటలు ముందే ఈ సినిమా రివ్యూ బయటకు వచ్చింది.
'కన్నప్ప'ను వీక్షించిన బాలీవుడ్ క్రిటిక్స్ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కడేల్ 'కన్నప్ప' చిత్రానికి 3.5 రేటింగ్ ఇచ్చి.. బొమ్మ బ్లాక్‌బస్టర్ అని తేల్చేశాడు. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి ఫుల్ రివ్యూ తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా పంచుకున్నాడు. అతని రివ్యూ ప్రకారం..
''కన్నప్ప' సినిమా చూసిన తర్వాత చివరి 30 నిమిషాలు ఇంకా మనసులో తిరుగుతూనే ఉన్నాయి. గతంలో ఇంతలా లోతుగా మనసును హత్తుకున్న సందర్భం 'కాంతార' క్లైమాక్స్ లో తప్ప మరొకటి గుర్తుకు రావడం లేదు. ముఖ్యంగా భగవంతుడిపై గాఢమైన భక్తి కలిగిన ప్రేక్షకులు — ప్రత్యేకించి పరమశివ భక్తులు — ఆ ఎమోషనల్ క్లైమాక్స్ చూసి కన్నీటి పర్యంతం అవుతారు.' అని 'కన్నప్ప' క్లైమాక్స్ ను ఓ లెవెల్ లో పొగిడేశాడు.
'ఇది కేవలం ఒక కథ కాదు.. ఒక సమాజం కోసం పోరాడిన యోధుడు, ఆరంభంలో దేవుడంటే నమ్మకంలేని వాడు ఎలా భగవంతుడి గొప్పతనాన్ని తెలుసుకుని పరమ శివునికి అంకితమైన భక్తుడిగా మారతాడో చూపించే అద్భుతమైన పరిణామ కథనం.
సినిమా నిడివి ఎక్కువగా ఉంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడవడం కొంతవరకూ నెగటివ్ పాయింట్. కానీ ఇంటర్వెల్ బ్లాక్, మోహన్‌లాల్ సీన్స్, ప్రభాస్ పవర్ఫుల్ కామియో.. అంతకన్నా ముఖ్యంగా చివరి క్లైమాక్స్ — ఇవన్నీ సినిమాని ఇంకొక లెవల్ కు తీసుకెళ్లాయి.
విష్ణు మంచు ఈ పాత్ర కోసం పుట్టినట్లే. యాక్షన్ సీన్లలోనూ, భావోద్వేగ సన్నివేశాల్లోనూ ఆయన జీవించాడు. ప్రత్యేకించి చివరి 15 నిమిషాల్లో ఆయన నటన.. ఆయన కెరీర్‌ని మలుపుతిప్పే విధంగా ఉంది. ప్రేక్షకుల నుంచి విపరీతమైన అభినందనలు అందుకుంటారు.
అక్షయ్ కుమార్ పరమశివునిగా అలరించారు. శివుడిగా సరిగ్గా సరిపోయారు. కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా ఎంతో నిబద్ధతతో నటించారు. మోహన్ బాబు పాత్రను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు — అద్వితీయంగా చేశారు.
మొత్తానికి చెప్పాలంటే.. 'కన్నప్ప' ఒక మంచి సినిమా. ఫస్ట్ హాఫ్ స్లోనెస్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సాధారణంగా ఉన్నప్పటికీ.. చివరి 40 నిమిషాలు మాత్రం అదిరిపోతాయి. విష్ణు మంచు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ కలిసి తెరపై చూపించిన శివలీల, ఆ భక్తి మార్గం.. ఇది ఒక సినిమా అనిపించదు. ఇది శివ భక్తుల కోసం, శివుని లీలపై విశ్వాసమున్నవారికి, సనాతన ధర్మంపై గర్వించేవారికి ఓ ఆధ్యాత్మిక అనుభవం లాంటి చిత్రంగా నిలుస్తుంది.' అని సుమిత్ కడేల్ తన రివ్యూలో చెప్పాడు.
మరో ఫిల్మ్ క్రిటిక్ రోహిత్ జైస్వాల్ కూడా 'కన్నప్ప'పై ప్రశంసల వర్షం కురిపించాడు. మొత్తంగా.. బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి 'కన్నప్ప'కు మంచి రివ్యూస్ దక్కుతున్నాయి. ఫైనల్ రివ్యూ అండ్ రిజల్ట్ గురించి తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.
#KanappaReview
— Sumit Kadel (@SumitkadeI) June 25, 2025
Rating - ⭐️⭐️⭐️🌟 ( 3.5 )
Just watched #Kanappa, and I still can’t shake off the last 30 minutes from my mind. The only time I’ve felt something this intense was during the climax of #Kantara. Audiences - especially devotees of Lord Shiva will be left in tears.… pic.twitter.com/MqPUdW9KVq
-
Home
-
Menu