పవన్ ట్వీట్‌కు కమల్ రిప్లై

విశ్వనటుడు కమల్ హాసన్‌కు అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డులను నిర్వహించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) సభ్యత్వానికి ఆయనకు ఆహ్వానం అందింది. ప్రపంచవ్యాప్తంగా 534 మందికి ఈ సారి కమిటీ సభ్యత్వం అందించగా, అందులో కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానా, పాయల్ కపాడియా, స్మృతీ ముంద్రాల వంటి భారతీయులూ ఉన్నారు. వీరందరికీ ఆస్కార్ నామినేషన్ల ఎంపిక నుంచి విజేతల ఫైనల్ ఓటింగ్ వరకూ హక్కు కలుగుతుంది.
ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. కమల్ హాసన్‌ను అభినందిస్తూ.. 'ఆరు దశాబ్దాల సినీ జీవితంలో కమల్ గారు నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా ఎన్నో కళాఖండాలను అందించారు. ఆయన్ని ట్రూ మాస్టర్ అనే చెప్పాలి. ఆయనకు ఆస్కార్ కమిటీలో స్థానం దక్కడం భారతీయ సినిమాకు గర్వకారణం,' అని ట్వీట్ చేశారు.
ఇంతవరకూ రెహమాన్, గుల్జార్, గునీత్ మోంగా, కీరవాణి, చంద్రబోస్ వంటి వారు ఆస్కార్ గెలిచి దేశానికి గౌరవం తీసుకురాగా.. ఇప్పుడు కమల్ హాసన్ ఆస్కార్ కమిటీలో సభ్యుడిగా ఎంపిక కావడం మరో ఘనతగా నిలిచింది.
మరోవైపు పవన్ కళ్యాణ్ పోస్టుకి కమల్ హాసన్ స్పందించారు. పవన్‌ను 'బ్రదర్' అంటూ సంభోధించిన కమల్, 'నీ మాటలు, విషెస్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. గ్లోబల్ స్టేజ్ మీద ఇండియన్ సినిమాని రిప్రెజెంట్ చేయడం నా కోసం గర్వకారణం' అని చెప్పారు. పవన్, కమల్ మధ్య ఈ ట్వీట్స్ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి.
Thank you brother, for your kind words and warm wishes. Honoured to serve and represent Indian cinema on the global stage. https://t.co/ioBJYP1sH1
— Kamal Haasan (@ikamalhaasan) June 29, 2025
-
Home
-
Menu