బన్నీ కోసం జపనీస్ కొరియోగ్రాఫర్

‘పుష్ప’తో పాన్ ఇండియా రేంజ్‌ని టచ్ చేసిన అల్లు అర్జున్.. ‘పుష్ప 2’తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ పై కన్నేశాడు అల్లు అర్జున్. ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రాలలో ఇదొకటి. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ చిత్రానికి జపనీస్-బ్రిటిష్ కొరియోగ్రాఫర్ హొకుటో కొనిషి స్టెప్పులు కంపోజ్ చేస్తున్నాడట. హిప్‌హాప్ డ్యాన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఆయన, అమెరికన్ రియాలిటీ షో So You Think You Can Dance లో రన్నరప్‌గా నిలిచాడు. లేటెస్ట్ గా అల్లు అర్జున్, అట్లీతో కలిసి ఉన్న బీటీఎస్ ఫొటోలు షేర్ చేస్తూ ‘భారతీయ సినిమాకు వర్క్ చేయాలని ఎప్పటి నుంచో కోరుకున్నా. ఈ సినిమా భారీ స్థాయిలో వస్తోంది‘ అని అన్నాడు. ఈ అప్డేట్ తో బన్నీ, అట్లీ మూవీలోని డ్యాన్సులు ఏ రేంజులో ఉండబోతున్నాయో అర్థమవుతుంది.
ఇక కాస్టింగ్ విషయానికి వస్తే.. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, జాన్వి కపూర్, రష్మిక మందన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారట. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను 2027లో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.
-
Home
-
Menu