చరణ్-ప్రశాంత్ ప్రాజెక్ట్ ఫిక్సైందా?

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తన సినిమాల ప్లానింగ్ లో వేగాన్ని పెంచుతున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది‘ సినిమా చేస్తున్న చరణ్.. ఆ తర్వాత సుకుమార్‌తో 17వ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమాని లైన్లో పెట్టాడనే న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుంది.
అసలు 2021లోనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా ఉంటుందని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు రామ్ చరణ్. డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుందని అప్పట్లో ట్విట్టర్ లో రెండు ఫోటోలను సైతం పోస్ట్ చేశాడు. మధ్యలో చరణ్, ప్రశాంత్ వేరే కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కి బ్రేకులు పడ్డాయి.
మరోవైపు ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ ‘డ్రాగన్‘తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ తో ‘సలార్ 2‘ చేయనున్నాడు. ప్రస్తుతానికైతే ప్రశాంత్ నీల్ కి ఈ రెండు ప్రాజెక్టులే ఉన్నాయని.. చరణ్ తో సినిమా ఇప్పట్లో ఉండే అవకాశాలు లేవని మరో కథనం కూడా సామాజిక మాధ్యమాల్లో జోరుగా చక్కర్లు కొడుతుంది.
-
Home
-
Menu