ఆకట్టుకుంటున్న ‘మోగ్లీ‘ గ్లింప్స్

ఆకట్టుకుంటున్న ‘మోగ్లీ‘ గ్లింప్స్
X
‘బబుల్ గమ్’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్ కనకాల. సుమ-రాజీవ్ కనకాల తనయుడైన రోషన్ తొలి సినిమాతోనే హీరోగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు.

‘బబుల్ గమ్’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్ కనకాల. సుమ-రాజీవ్ కనకాల తనయుడైన రోషన్ తొలి సినిమాతోనే హీరోగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ఇప్పుడు తన తర్వాతి చిత్రాన్ని ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్‌తో చేస్తున్నాడు. ‘మోగ్లీ 2025’ టైటిల్‌తో అడ్వంచరస్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

జంగిల్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా గ్లింప్స్ రిలీజయ్యింది. నేచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. ఒక చిన్న ప్రేమ కథ అంటూ ఒక పెద్ద ప్రేమ కథనే చెప్పాడు దర్శకుడు సందీప్ రాజ్. గ్లింప్స్ చూస్తే కథకు రోషన్ కనకాల బాగా సూట్ అయినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ గ్లిమ్స్ తో సినిమాపై మంచి ఇంట్రెస్ట్ తీసుకొచ్చాడు దర్శకుడు.

ఈ సినిమాలో రోషన్ కి జోడీగా సాక్షి మధోల్కర్ నటిస్తుంది. కీలక పాత్రల్లో బండి సంజయ్ కుమార్, హర్ష చెముడు నటిస్తున్నారు. కాల భైరవ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags

Next Story