ఇమాన్వి ఎమోషనల్ స్టేట్‌మెంట్!

ఇమాన్వి ఎమోషనల్ స్టేట్‌మెంట్!
X
పహల్గాం ఘటన చిత్ర పరిశ్రమను సైతం కుదిపేస్తోంది. భారతీయ చిత్రాలలో పాకిస్తానీ నటులు ఎవరూ నటించ కూడదని డిమాండ్స్ పెరుగుతున్నాయి.

పహల్గాం ఘటన చిత్ర పరిశ్రమను సైతం కుదిపేస్తోంది. భారతీయ చిత్రాలలో పాకిస్తానీ నటులు ఎవరూ నటించ కూడదని డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఈకోవలోనే ప్రభాస్ ‘ఫౌజీ‘ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఇమాన్వీ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు పెరిగాయి.

ఇమాన్వీ పాకిస్తానీ సంతతకు చెందనది అని.. ఆమె తండ్రి పాకిస్తాన్ మిలటరీలో పనిచేశారనే న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈనేపథ్యంలో ఈ విషయాలపై ఓ ప్రకటన రూపంలో క్లారిటీ ఇచ్చింది ఇమాన్వి.

ఇమాన్వి విడుదల చేసిన ప్రకటనలో, ఆమె పహల్గాం లో జరిగిన విషాద ఘటనపై తన హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తపరిచింది. అమాయకుల ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, హింసను ఖండిస్తూ, కళ ద్వారా ప్రేమను, ఐక్యతను పంచే తన ఆకాంక్షను తెలియజేసింది.

అంతేకాక, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, పుకార్ల వల్ల తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసిన అభ్యంతరకర వార్తలపై ఆమె స్పష్టతనిచ్చింది. ఆమె కుటుంబానికి పాకిస్తాన్ మిలిటరీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ పుకార్లన్నీ ద్వేషాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతోనే కల్పించబడ్డాయని తెలిపింది ఇమాన్వి.

ఇమాన్వి తన భారతీయ అమెరికన్ పరంపరను గర్వంగా గుర్తు చేసుకుంటూ, తన తల్లిదండ్రులు చట్టబద్ధంగా అమెరికా వచ్చారని, తానూ అమెరికాలోనే పుట్టి, విద్యను పూర్తి చేసి, నటిగా, కొరియోగ్రాఫర్‌గా కళారంగంలో ఎదిగిన వ్యక్తిగా పేర్కొంది.

భారతీయ సంస్కృతి పట్ల గాఢమైన అనుబంధం ఉన్న తాను, చిత్ర పరిశ్రమలో అవకాశాలు లభించినందుకు కృతజ్ఞతలు తెలిపుతూ, ఈ మాధ్యమాన్ని ఐక్యతను కలిగించే వేదికగా మలచాలనే లక్ష్యాన్ని పునరుద్ఘాటించింది. తాను కళ ద్వారా ప్రేమను, అవగాహనను, అనుబంధాన్ని నిర్మించాలని ప్రయత్నిస్తానని, భారతీయ వారసత్వాన్ని గౌరవిస్తూ, బాధను పంచుకుంటూ, కలసి ముందుకు సాగుదానని తన ప్రకటనలో తెలిపింది.

Tags

Next Story