ఎన్టీఆర్ మల్టీ టాలెంట్‌కు హృతిక్‌ సెల్యూట్!

ఎన్టీఆర్ మల్టీ టాలెంట్‌కు హృతిక్‌ సెల్యూట్!
X
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌.. తెలుగు సినిమా రంగంలో మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు పొందినవాడు. అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ, ఎనర్జిటిక్ డ్యాన్స్‌ లతో ప్రేక్షకుల మనసు దోచుకున్న తారక్‌, ఇప్పుడు బాలీవుడ్‌కూ ఫేవరెట్‌గా మారబోతున్నాడు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌.. తెలుగు సినిమా రంగంలో మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు పొందినవాడు. అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ, ఎనర్జిటిక్ డ్యాన్స్‌ లతో ప్రేక్షకుల మనసు దోచుకున్న తారక్‌, ఇప్పుడు బాలీవుడ్‌కూ ఫేవరెట్‌గా మారబోతున్నాడు. ‘వార్‌ 2’ సినిమా ద్వారా హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్న ఎన్టీఆర్‌పై, ఈ సినిమాలో ఆయన కో-స్టార్ హృతిక్ రోషన్ ప్రశంసల జల్లు కురిపించాడు.

జార్జియాలో జరిగిన ఓ ఈవెంట్‌లో హృతిక్ మాట్లాడుతూ, ‘‘వార్‌ 2'లో నటించడం నాకు గర్వంగా ఉంది. తారక్‌ నా ఫేవరెట్‌ కో-స్టార్‌. అతడు కేవలం గొప్ప నటుడే కాకుండా, మంచి వ్యక్తి కూడా. డ్యాన్స్‌లో అతడి టాలెంట్ అమోఘం. నేను కూడా నన్ను నిజంగా పరీక్షించుకుంటున్నాను' అన్నాడు.

అయితే, హృతిక్ చెప్పిన మరో ఆసక్తికర విషయం ఆయన అభిమానాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. తారక్‌ కేవలం నటుడిగా కాకుండా, ఓ అద్భుతమైన చెఫ్‌ అని పేర్కొన్నాడు. 'ప్రపంచంలోనే బెస్ట్ చెఫ్ ఎన్టీఆర్‌నే. అతడి వంటల టేస్ట్ మర్చిపోలేను' అంటూ, తారక్ కుకింగ్‌ స్కిల్స్‌ను విపరీతంగా పొగిడాడు.

ఇక 'వార్ 2' విషయానికొస్తే, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ ఆగస్టు 14న విడుదల కానుంది. ఇందులో హృతిక్ మేజర్ కబీర్‌గా, ఎన్టీఆర్ వీరేంద్ర రఘునాథ్ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది.

Tags

Next Story