
‘కుబేర‘ సినిమా హైలైట్స్ ఇవిగో..!

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘కుబేర’. ఈ చిత్రం రేపు గ్రాండ్ లెవెల్ లో వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు వస్తుంది. తమిళ స్టార్ ధనుష్ టైటిల్ రోల్ పోషించగా, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తన సినిమాల్లో సహజత్వానికి పెద్ద పీట వేసే శేఖర్ కమ్ముల.. ఈసారి తన శైలికి భిన్నంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించాడు. తన కంఫర్ట్ జోన్‌ను దాటి భారీ సెట్స్, స్టార్లతో ఈ సినిమాని తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కించాడు. ఎమోషన్స్, కామెడీ, థ్రిల్ – అన్నీ మిళితమై ఉండేలా ఈ సినిమాని రూపొందించాడు శేఖర్.
‘కుబేర’లో ధనుష్ ఓ బిచ్చగాడిగా కనిపించబోతున్నాడు. అయితే ఇది ఓ బిచ్చగాడి కథ కాదు. ఇది ఓ సాధారణ వ్యక్తి నుంచి విజయశిఖరాలు చేరే అండర్డాగ్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. నాగార్జున పాత్రకూ స్టోరీలో సాలిడ్ ఇంపార్టెన్స్ ఉండబోతుంది. రష్మిక పాత్ర కూడా కథకు ఎంతో కీలకంగా ఉంటుంది. ఇంకా జిమ్ సర్భ్, సాయాజీ షిండే వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ చిత్రానికి మరో మెయిన్ అట్రాక్షన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘అనగనగా కథ, పిప్పి పిప్పి డుం డుం, నా కొడుకా’ వంటి పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ట్రాన్స్ ఆఫ్ కుబేర లో వినిపించిన ‘నాది నాది నాదే ఈ లోకమంతా…‘ పాట అయితే జనాల్లోకి బాగా వెళ్లిపోయింది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ లపై సునీల్ నారంగ్, పుస్కర్ రామ్మోహన్ రావు లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ఈ సినిమాకి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ టెక్నికల్ గా ప్లస్ పాయింట్స్.
‘యు/ఏ’ సర్టిఫికేట్ పొందిన ‘కుబేర‘ నిడివి 3 గంటల 1 నిమిషం. ఇదివరకు శేఖర్ తీసిన సినిమాలలో ఇదే లాంగెస్ట్ మూవీ. ప్రస్తుతం అంతటా పాజిట్ వైబ్స్ క్రియేట్ చేసిన ‘కుబేర‘ ఫైనల్ రిపోర్ట్ మరికొద్ది గంటల్లో రానుంది.
-
Home
-
Menu