తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల హైలైట్స్

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల హైలైట్స్
X
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు హైదరాబాద్ హైటెక్స్‌ వేదికగా అంగరంగ వైభవంగా జరిగాయి.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు హైదరాబాద్ హైటెక్స్‌ వేదికగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి ప్రముఖులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన అనేక మంది హాజరయ్యారు.

కార్యక్రమ ఆరంభంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి నేతృత్వంలో చిన్నారుల బృందం తెలంగాణ గీతం ఆలపించడం విశేషం. అనంతరం సింగర్ మంగ్లీ ‘బండెనుక బండి కట్టి…’ అనే విప్లవ గీతాన్ని ఆలపించగా, గద్దర్ సతీమణి విమల భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ పాటను గద్దర్ "మా భూమి" చిత్రంలో ఆలపించిన సంగతి తెలిసిందే.

ఈ వేడుకలో పలువురు ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. నందమూరి బాలకృష్ణ – ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు, విజయ్ దేవరకొండ – కాంతారావు అవార్డు అందుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఉమ్మడి రాష్ట్రంలో 1964లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన నంది అవార్డుల సంప్రదాయాన్ని తెలంగాణలో గద్దర్ పేరిట కొనసాగిస్తున్నామని ప్రకటించారు. 'గద్దర్ అంటే విప్లవం, వేగం… ఆయన మా స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే మేం పోరాటాలు చేశాం' అని గద్దర్‌ను స్మరించుకున్నారు.

'బన్నీ కాలేజ్ డేస్ నుండే నాకు తెలుసు.. అతను నాకు మిత్రుడు.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఈనాడు తెలుగు సిని పరిశ్రమకు 4వ తరం ప్రాతినిధ్యం వహిస్తున్నారు' అని రేవంత్ రెడ్డి అన్నారు.

'భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ. ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా, అది మీ అభివృద్ధికే' అని భరోసా ఇచ్చారు. '2047 విజన్ డాక్యుమెంట్'లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక అధ్యాయం ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చే లక్ష్యం ఉందన్నారు.

Tags

Next Story