అల్లు అర్జున్-అట్లీ మూవీ మొదలైందా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ పాన్-ఇండియా సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ముంబైలో ఈ సినిమా పూజా కార్యక్రమం ఎంతో నిరాడంబరంగా ముగిసినట్లు సమాచారం. అలాగే ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా షూటింగ్ ను కూడా పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోందట.
ఈ చిత్రం ముంబైతో పాటు విదేశాలలో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకోనుంది. అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ తోనే ఇదొక విజువల్ వండర్ లా రూపొందుతుందనే అంచనాలు మొదలయ్యాయి. ప్రపంచంలోని ఎక్స్‌పెర్ట్ వీఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. అల్లు అర్జున్ ఈ చిత్రంలో సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడని, ఇది బన్నీ కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ మూవీలో అల్లు అర్జున్ డ్యూయెల్ రోల్ చేయనున్నాడనే ప్రచారం ఉంది. బన్నీకి జోడీగా ముగ్గురు భామలు నటించనున్నారట. మొత్తంగా ఇండియా నుంచి గ్లోబల్ లెవెల్ లో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసేలా అల్లు అర్జున్-అట్లీ మూవీ రెడీ అవుతుంది.
-
Home
-
Menu