‘హరిహర వీరమల్లు‘ ట్రైలర్ టాక్!

‘హరిహర వీరమల్లు‘ ట్రైలర్ టాక్!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ 'హరిహర వీరమల్లు'. పవన్ నటించిన తొలి చారిత్రక కథాంశ చిత్రమిది. ఈ సినిమాలో ‘వీరమల్లు‘గా ఓ యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ 'హరిహర వీరమల్లు'. పవన్ నటించిన తొలి చారిత్రక కథాంశ చిత్రమిది. ఈ సినిమాలో ‘వీరమల్లు‘గా ఓ యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు. 400 ఏళ్ల క్రితం నాటి మొఘలుల కథతో రూపొందిన ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ, క్రిష్ సంయుక్తంగా తెరకెక్కించారు. ఎ.ఎమ్.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా మోస్ట్ అవైటింగ్ ట్రైలర్ వచ్చేసింది.

మొఘలుల కాలంనాటి ఔరంగజేబు నేపథ్యాన్ని పరిచయం చేస్తూ.. ‘హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం.. ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం.. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం.. ‘ అంటూ అర్జున్ దాస్ వాయిస్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ట్రైలర్ ప్రారంభంలో బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలోని క్రూరత్వాన్ని చూపిస్తూనే.. యోధుడిగా వీరమల్లు పాత్రను పరిచయం చేశారు. ‘ఇప్పుడు దాకా మేకలు తినే పులులు చూసుకుంటారు.. ఇప్పుడు పులిని వేటాడే బెబ్బులిని చూస్తారు..‘ అంటూ వీరమల్లు పాత్రలో పవన్ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఆహార్యం, మేనరిజమ్స్, యుద్ధ సన్నివేశాలు ఈ ట్రైలర్ కి హైలైట్స్.

పవన్ కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తే.. ఇతర కీలక పాత్రల్లో బాబీ డియోల్, తనికెళ్ల భరణి, సునీల్, సత్యరాజ్ వంటి వారు కనిపిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం ఈ మూవీకి మరో మేజర్ హైలైట్. జూలై 24న పాన్ ఇండియా లెవెల్ లో ‘హరిహర వీరమల్లు‘ విడుదలకు ముస్తాబవుతుంది.



Tags

Next Story