జూలై 24న 'హరిహర వీరమల్లు'!

జూలై 24న హరిహర వీరమల్లు!
X
పవన్ కళ్యాణ్‌ హిస్టారికల్ యాక్షన్‌ డ్రామా ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రానికి జులై 24ను కొత్త రిలీజ్‌ డేట్‌గా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

గత ఐదేళ్లుగా షూటింగ్‌ సాగుతూ వచ్చిన ఈ సినిమా తొలుత 2020లో ప్రారంభమైంది. రాజకీయ కారణాలతో పవన్ కళ్యాణ్ బిజీతో పాటు దర్శకుడు మార్పు వంటి అంశాలతో ఈ సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. దర్శకుడు క్రిష్‌ నుంచి జ్యోతికృష్ణ బాధ్యతలు తీసుకున్నాడు. చివరకు చిత్రీకరణ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుని 'వీరమల్లు' విడుదలకు ముస్తాబవుతుంది.

బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్‌ ఇందులో విలన్ గా కనిపించబోతున్నాడు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించగా.. అనుపమ్ ఖేర్, సత్యరాజ్, సునీల్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలోని ఓ పెద్ద వార్ సీక్వెన్స్ ను పవన్ కళ్యాణ్ స్వయంగా కంపోజ్ చేయడం విశేషం. ఇక ఈసారి అయినా వాయిదాలు లేకుండా సినిమా విడుదల అవుతుందా? లేక మళ్లీ అదే పాత కథే పునరావృతమవుతుందా? అన్నది చూడాలి.

Tags

Next Story