భారీగా తగ్గిన కలెక్షన్స్!

భారీగా తగ్గిన కలెక్షన్స్!
X
పవన్ కళ్యాణ్ పీరియాడిక్ ఎపిక్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ భారీ అంచనాల మధ్య విడుదలైంది. విడుదల ముందు నుంచే మిశ్రమ స్పందన, వ్యతిరేక ప్రచారం ప్రభావం పడినా, ప్రీమియర్ షోలు భారీగా జరగడం ద్వారా సినిమా మొదటి రోజునే రికార్డు స్థాయి ఓపెనింగ్ సాధించింది.

సెకండ్ హాఫ్ నేరేషన్ పై విమర్శలు రావడం, విజువల్ ఎఫెక్ట్స్ వీక్ అవ్వడం వంటివి సినిమాకి నెగటివ్ గా మారాయి. అలాగే కొన్ని ట్రోలింగ్‌కు గురైన సీన్లను మేకర్స్ రెండో రోజు నుంచి తొలగించినట్లు సమాచారం. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడటం కూడా కలెక్షన్లు తగ్గడానికి ప్రధాన కారణాలుగా కనిపించాయి.

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే నైజాం రూ.37 కోట్లు, సీడెడ్ రూ.16 కోట్లు, ఆంధ్రా రూ.50 కోట్లు జరిగింది. టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం రూ. 103 కోట్లకు అమ్ముడయ్యింది. అంటే.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే ఇంకా వీరమల్లు సగానికిపైగా కలెక్షన్లు సాధించాల్సి ఉంది. శనివారం, ఆదివారం వీకెండ్స్ కాబట్టి.. ఈ రెండు రోజులలో 'వీరమల్లు' కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.

Tags

Next Story