హ్యాపీ బర్త్‌డే ప్రశాంత్ నీల్!

స్టార్ హీరోలు మాత్రమే కాదు.. కొంతమంది స్టార్ డైరెక్టర్స్ కూడా సినీ ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు. తాము అనుకున్న హీరోలతో.. తాము నిర్దేశించిన బడ్జెట్ లో సినిమాలను తెరకెక్కించే స్వేచ్ఛను పొందుతున్నారు. అలాంటి వారిలో కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒకడు.
పేరుకు కన్నడ ఇండస్ట్రీ వాడే అయినా.. అచ్చమైన తెలుగు వాడు ప్రశాంత్ నీల్. అందుకే.. వరుసగా తెలుగు హీరోలతోనే సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటివరకూ పదకొండేళ్ల పాటు సాగిన ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రస్థానంలో ప్రేక్షకుల ముందుకొచ్చినవి నాలుగు చిత్రాలు మాత్రమే. ఇక.. మరో ఐదారేళ్ల పాటు ఈ సెన్సేషనల్ డైరెక్టర్ నుంచి మరో మూడు, నాలుగు చిత్రాలు మాత్రమే రాబోతున్నాయి.
ప్రస్తుతం నీల్.. ఎన్టీఆర్ తో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్-నీల్ మూవీ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది. ఈ చిత్రం 2026, జూన్ 25న విడుదలకానుంది. ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌తో పాటు ప్రశాంత్ నీల్ కిట్టీలో ఉన్న క్రేజీ సీక్వెల్స్ 'సలార్ 2, కె.జి.యఫ్ 3'. ఇంకా రామ్ చరణ్ వంటి మరికొంతమంది స్టార్స్ తోనూ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఈరోజు ఈ సెన్సేషనల్ డైరెక్టర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ కు బర్త్ డే విషెస్ తెలుపుతుంది తెలుగు 70 ఎమ్.ఎమ్.
-
Home
-
Menu