హ్యాపీ బర్త్‌డే పవర్‌స్టార్

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్, తన భిన్నమైన ఆలోచనలతో, అప్రతిహతమైన కృషితో తానేంటో నిరూపించుకున్నాడు. తొలి సినిమా పెద్ద విజయం కాకపోయినా ఆ తర్వాత నుంచి ఒక్కో సినిమాకి తన క్రేజ్ ను పెంచుకుంటూ వెళ్లాడు.
'తొలిప్రేమ'తో యూత్‌కి ఆరాధ్యుడిగా మారాడు. 'ఖుషీ'తో స్టార్డమ్ శిఖరాలు అందుకున్న పవన్, తన స్టైల్, మార్షల్ ఆర్ట్స్, ట్రెండ్ సెట్టింగ్ డైలాగ్స్‌తో ఫ్యాన్స్ మదిలో ప్రత్యేక స్థానం సంపాదించాడు. దర్శకుడిగా 'జానీ' ప్రయత్నించినా ఫలితం నిరాశ కలిగించింది. వరుస ఫ్లాపులు ఎదురైనా, పవన్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మళ్లీ 'గబ్బర్ సింగ్'తో కలెక్షన్ సునామీ సృష్టించి, 'అత్తారింటికి దారేదీ'తో అఖండ బ్లాక్‌బస్టర్ ఇచ్చాడు.
ఇక రాజకీయాల్లో తనదైన మార్గంలో నడుస్తూ జనసేన పార్టీని స్థాపించాడు. ఎన్నో విమర్శలు, ఆటుపోట్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా తన సిద్ధాంతాల కోసం పోరాడుతూ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం స్థాయికి ఎదిగాడు.
సినిమాల పట్ల ఉన్న ప్యాషన్‌తో 'వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్'రోలతో రీ ఎంట్రీ ఇచ్చి హిట్స్ సాధించాడు. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' తర్వాత, ఈ దసరాకు 'ఓజీ'తో, వచ్చే ఏడాది 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అభిమానులు స్టార్ హీరోగానే కాదు, రియల్ హీరో గానే చూసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగు 70 ఎమ్.ఎమ్.
-
Home
-
Menu