హ్యాపీ బర్త్‌డే 'ఓజీ'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీస్ లో 'ఓజీ'ది ప్రత్యేకమైన స్థానం. ఈ సినిమాను గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా సుజీత్ తెరకెక్కించాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య – దాసరి కల్యాణ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంకా అరుల్ మోహన్ నటించగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నాడు. ఇమ్రాన్ ఈ సినిమాలో పోషిస్తున్న పాత్ర పేరు ఓమీ. ఈరోజు పవన్ బర్త్‌డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. 'డియర్ ఓజీ.. నిన్ను కలవాలని.. నీతో మాట్లాడాలని.. నిన్ను చంపాలని ఎదురుచూస్తున్న నీ ఓమీ' అంటూ ఇమ్రాన్ హష్మీ చెప్పే డైలాగ్స్ తో ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. ఇక చివరిలో 'ఓజీ'గా పవర్ స్టార్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ గ్లింప్స్ కే హైలైట్.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన 'ఫైర్ స్టార్మ్, సువ్వి సువ్వి' పాటలు సూపర్ హిట్ అయ్యి, సినిమా పై అంచనాలు మరింత పెంచాయి. పవన్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్, గ్లింప్స్ సినిమాపై హైప్‌ని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ‘ఓజీ వర్సెస్ ఓమీ’ గ్యాంగ్‌స్టర్ వార్‌నే ఈ సినిమాకి హైలైట్‌గా చూపించనున్నట్టు ఈ గ్లింప్స్ ను బట్టి తెలుస్తోంది. సెప్టెంబర్ 25న 'ఓజీ' థియేటర్లలోకి రాబోతుంది.
-
Home
-
Menu