హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్!

హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్!
X
చిన్న వయస్సులోనే బాక్సాఫీస్‌ను గడగడలాడించిన ఎన్టీఆర్, సీనియర్‌కు తగిన వారసుడిగా మాత్రమే కాకుండా, తన సొంత శైలిలో గొప్ప నటుడిగా ఎదిగాడు. పాత్రల ఎంపిక, నటనా నైపుణ్యం– ఏ కోణంలో చూసినా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.

నందమూరి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ తెలుగు తెరకు పరిచయమైన ఎన్టీఆర్. బాల నటుడిగా రాముడయ్యాడు. టీనేజ్ లోనే ‘స్టూడెంట్ నెంబర్ వన్, ఆది’లతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ‘సింహాద్రి’తో తన సత్తా ఏంటో చెప్పి టాలీవుడ్ టాప్ హీరోల సరసన చేరాడు.

చిన్న వయస్సులోనే బాక్సాఫీస్‌ను గడగడలాడించిన ఎన్టీఆర్, సీనియర్‌కు తగిన వారసుడిగా మాత్రమే కాకుండా, తన సొంత శైలిలో గొప్ప నటుడిగా ఎదిగాడు. పాత్రల ఎంపిక, నటనా నైపుణ్యం– ఏ కోణంలో చూసినా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.

ఒక దశలో ఫ్లాపుల మధ్య తన కెరీర్‌ను నిలబెట్టుకున్న తారక్, మళ్లీ రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ లాంటి దర్శకులతో పునరుజ్జీవనం పొందాడు. ‘టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత’ సినిమాల ద్వారా నటనలో వైవిధ్యం చూపించాడు.

అలాగే, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’లో కొమరం భీమ్‌గా ఇంటర్నేషనల్ రేంజ్‌లో గుర్తింపు సంపాదించాడు. ఈ సినిమా ద్వారా గ్లోబల్ ఫేమ్‌కి ఎదిగిన తారక్, ‘దేవర’ వంటి బిగ్ హిట్స్ తో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. ప్రస్తుతం ‘వార్ 2, 'డ్రాగన్' ప్రాజెక్టులతో పాన్ వరల్డ్ రేంజులో మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెబుతుంది తెలుగు 70 ఎమ్.ఎమ్.

Tags

Next Story