హ్యాపీ బర్త్‌డే నాగవంశీ

తెలుగు సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా దూసుకెళ్తున్న కొద్దిమంది నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీ ఒకరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలకు వేదిక అయిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉండే నాగవంశీ.. మిగతా ప్రయోగాత్మక, కమర్షియల్ సినిమాల కోసం ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ను స్థాపించారు. బాబాయ్ ఎస్. రాధాకృష్ణ (చినబాబు) మద్దతుతో అతి తక్కువ సమయంలోనే సితారను టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా నిలిపారు.
2014లో ‘లవర్స్’తో తన ప్రొడక్షన్ జర్నీ మొదలుపెట్టిన నాగవంశీ, 2016లో ‘బాబు బంగారం’, ‘ప్రేమమ్’ సినిమాలతో పూర్తి స్థాయి నిర్మాతగా నిలదొక్కుకున్నారు. అనంతరం ‘జెర్సీ’, ‘భీష్మ’, ‘డీజే టిల్లు’, ‘భీమ్లా నాయక్’, ‘సార్’, ‘టిల్లు స్క్వేర్’, ‘లక్కీ భాస్కర్’, ‘డాకు మహారాజ్’ వంటి వరుస విజయాలతో టాప్ ప్రొడ్యూసర్ గా మారారు.
కమర్షియల్‌గా బలమైన సినిమాలతో పాటు, కొత్త కంటెంట్‌కి పట్టం కడుతూ మీడియం బడ్జెట్ మూవీస్‌కి సైతం బలమైన మార్కెట్‌ని క్రియేట్ చేశారు. ముఖ్యంగా ‘జెర్సీ’, ‘సార్’ వంటి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా కూడా నిలిచాయి.
ప్రస్తుతం ‘కింగ్డమ్’, ‘మాస్ జాతర’, ‘లెనిన్’, ‘అనగనగా ఒక రాజు’ వంటి ఆసక్తికరమైన ప్రాజెక్టులతో పాటు, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో వస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్ 2’ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు.
ఆసక్తికరమైన కంటెంట్ తో సినిమాలను నిర్మిస్తూ, యువతరం నిర్మాతలకు ఓ రోల్ మోడల్‌గా నిలుస్తున్న సూర్యదేవర నాగవంశీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగు 70 ఎమ్.ఎమ్. ఇకపైనా నాగవంశీ మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుందాం.
-
Home
-
Menu