'ఆర్.ఆర్.ఆర్' సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్!

ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్!
X
గ్లోబల్ స్టేజ్‌పై భారత సినిమాకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. ఎన్టీఆర్‌, రామ్ చరణ్ కలయికలో క్రేజీ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి తీర్చిదిద్దిన ఈ పీరియాడిక్ మూవీ పాన్ వరల్డ్ రేంజులో సంచలనాలు సృష్టించింది.

గ్లోబల్ స్టేజ్‌పై భారత సినిమాకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. ఎన్టీఆర్‌, రామ్ చరణ్ కలయికలో క్రేజీ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి తీర్చిదిద్దిన ఈ పీరియాడిక్ మూవీ పాన్ వరల్డ్ రేంజులో సంచలనాలు సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో ఆస్కార్ అవార్డుల పంట పండించింది.

ఇప్పటికే 'ఆర్.ఆర్.ఆర్' సీక్వెల్‌పై పలు ఊహాగానాలు వెలువడుతున్న సమయంలో, తాజాగా దర్శకధీరుడు రాజమౌళి నుంచి నేరుగా సంకేతం వచ్చేసింది. రామ్ చరణ్ షేర్ చేసిన ఓ వీడియోలో 'ఆర్.ఆర్.ఆర్ 2 ఎప్పుడు?' అనే ప్రశ్నకు రాజమౌళి నవ్వుతూ 'తప్పకుండా చేస్తాం!' అని సమాధానమిచ్చాడు. ఈ దృశ్యం లండన్‌లో జరిగిన 'ఆర్.ఆర్.ఆర్' లైవ్ కాన్సర్ట్ సమయంలో చోటు చేసుకుంది.

ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికగా జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌కు రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి హాజరయ్యారు. అక్కడ హీరోలు ఇద్దరూ రాజమౌళిని ఆటపట్టించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంతకుముందు విజయేంద్ర ప్రసాద్ కూడా 'ఆర్.ఆర్.ఆర్' సీక్వెల్‌పై ఆలోచనలు కొనసాగుతున్నాయని చెప్పిన నేపథ్యంలో, ఇప్పుడు రాజమౌళి స్వయంగా 'చేస్తాం' అన్న పదం చెప్పడం చిత్ర ప్రేమికుల్లో నూతన ఉత్సాహం నింపింది.



Tags

Next Story