పవన్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం బాధ్యతల వల్ల సినిమా ప్రమోషన్‌లకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఎట్టకేలకు 'హరిహర వీరమల్లు' సినిమా కోసం ప్రచార రంగంలోకి దిగబోతున్నాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ సినిమాలకు సంబంధించి ప్రెస్ మీట్స్ దూరంగా ఉండడం ఫ్యాన్స్‌కి కొంత అసంతృప్తిని మిగిల్చింది. అయితే ఈసారి ఆ ట్రెండ్ బ్రేక్ చేయబోతున్నాడు పవర్‌స్టార్.
ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో ఓ స్టార్ హోటల్‌లో 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌ను నిర్వహించబోతున్నారు. ఇందులో యూనిట్ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నాడు. ఇదే కాకుండా ఈ రోజున సాయంత్రం శిల్పకళా వేదికలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనికి రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.
ఈ ప్రెస్ మీట్‌లో పవన్ పలు ఆసక్తికర అంశాలను పంచుకునే అవకాశం ఉంది. సినిమా ఆలస్యం, దర్శకుడు క్రిష్ తప్పుకోవడం, బడ్జెట్ సమస్యలు, పాన్ ఇండియా ప్రమోషన్లు లేకపోవడానికి ఉన్న కారణాలపై స్పష్టత ఇవ్వొచ్చు. ఒకేరోజున ప్రెస్ మీట్, ఈవెంట్—ఇవన్నీ పవన్ అభిమానులకు డబుల్ ట్రీట్‌లా మారాయి.
-
Home
-
Menu